▪ పట్టించుకోని ప్రభుత్వఅధికారులు.
పయనించే సూర్యుడు జనవరి 17హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానంద రెడ్డి... వెన్నంపల్లి - సింగపూర్ రోడ్డు ప్రయాణం వాహనాదారులకు నరకయాతనంగా తయారయింది. రోడ్డు పూర్తిగా పెచ్చులు లేచి, గుంతలు ఏర్పడి నిత్యం ప్రమాదలు ఏర్పడుతున్నాయి. ఇటీవల ప్రమాదాలు జరిగి క్షతగాత్రులైన ఘటనలు కూడా ఉన్నాయి. హుజురాబాద్ కి నిత్యo ఈ మార్గం ద్వారా ప్రయాణాలు చేస్తారు. రాత్రుల్లో ఈ మార్గం ద్వారా ప్రయాణం చేయాలంటే వాహనదారులు జoకుతున్నారు. గత ప్రభుత్వంలో శంకుస్థాపనలు చేసి రోడ్డు నిర్మాణం చేయకుండా వదిలేశారు. కావున ఇప్పటికైనా అధికారులు స్పందించి కొత్త బీటీ రోడ్డు వెయ్యాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.