పయనించే సూర్యుడు న్యూస్ 17 సూర్యాపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట జిల్లాను రాజకీయాలకి అతీతంగా సర్వతో ముఖాభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తునని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.సూర్యాపేట కలెక్టరేట్ లో కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన 79 వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్,జిల్లా ఎస్పీ కే నరసింహ తో కలిసి రాష్ట్ర నీటి పారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోలీసులచే గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతకాన్ని ఎగురవేసి, జాతీయ గీతాలాపన, తెలంగాణ రాష్ట్రీయ గీతాలాపన ఆలపించారు.తదుపరి ప్రజలని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రియమైన జిల్లా ప్రజలకు, స్వాతంత్ర్య సమరయోధులకు ఉద్యమకారులకు,జిల్లా న్యాయమూర్తులకు,ప్రజా ప్రతినిధులకు,అధికారులకు, అనధికారులకు,పాత్రికేయులకు, కార్మిక, కర్షక, విద్యార్థిని విద్యార్థులు, ఉద్యమంలో అసువులు బాసిన తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు 79 వ భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వాతంత్ర్య పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని ఆహింసే అస్త్రంగా మహా సంగ్రామాన్ని గెలిచి ప్రపంచానికి సరికొత్త పోరాట పంథాను పరిచయం చేసిందని మహాత్ముడి సారథ్యంలో బయట శతృవులైన బ్రిటీషర్లపై యుద్ధం గెలిచిన మనం. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ సారథ్యంలో దేశ అంతర్గత శతృవులైన పేదరికం, అసమానతలు, అస్పృశ్యత, అంటరానితనంపై పోరాటానికి నాంది పలికామని,మనం సాధించుకున్న స్వాతంత్ర్యానికి అర్థం, పరమార్థం చేకూర్చే ప్రజాస్వామ్య పాలనకు పునాదులు వేసుకున్నమని ఈ పవిత్రమైన రోజు ఆ త్యాగధనులకు మనస్పూర్తిగా జోహార్లు అర్పిస్తూ,అట్టి మహనీయుల స్పూర్తితో వారి అడుగుజాడల్లో నడుస్తూ,పూజ్య బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేయడంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం మన జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మరియు పథకాల ప్రగతిని మీకు తెలియజేయడానికి నేనెంతో సంతోషిస్తున్నాను. ప్రభుత్వ పథకాల్లో మహాలక్ష్మి పథకం: ప్రజా ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే మహాలక్ష్మీ పథకం కింద ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించాం.ఈ పథకం కింద ఆడబిడ్డలకు రూ.6 వేల 790 కోట్లు ఆదా అయ్యింది. ఇటీవలే 200 కోట్ల జీరో టికెట్ల మైలురాయిని దాటడం మా విజయాలలో మరో మైలురాయి. రాష్ట్రంలో ఆడబిడ్డల సంక్షేమం, అభివృద్ధి కోసం మా ప్రభుత్వం మొత్తంగా 46 వేల 689 కోట్లు సమకూర్చిందని ఈ పథకంలో బాగంగా జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 3 కోట్ల 48 లక్షల మంది మహిళా ప్రయాణికులు ఉచిత ప్రయాణాన్ని పొంది రూ.191 కోట్ల 78 లక్షల మొత్తాన్ని ఆదా చేసుకోవడం జరిగిందని అన్నారు. పౌరసరఫరాల శాఖ(డిఎస్ఓ& డీమక్స్)రూ.500 కు LPG గ్యాస్ ఈ పథకం ద్వారా జిల్లాలో 4 లక్షల 5 వేల 898 మంది వినియోగదారులకు 5 లక్షల 52 వేల 43 సిలిండర్లు పంపిణీ చేయబడ్డాయని,ఇందుకు గాను సబ్సిడీ మొత్తం రూ.15 కోట్ల 26 లక్షలు లబ్దిదారులకు అకౌంటు ద్వారా జమ చేయబడినవని తెలిపారు.సన్న వరి పై రూ.500 బోనస్: రాష్ట్రంలో 7,178. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి చివరి గింజ వరకు ధాన్యం కొన్నాం. సన్నాలకు క్వింటాల్ కు రూ.500 బోనస్ ఇస్తున్నామని ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని జిల్లాలో 2024-25
యాసంగి నందు 7 వేల 266 మంది రైతుల వద్ద మొత్తం 50 వేల 816 మెట్రిక్ టన్నుల సన్న వడ్లను కొనుగోలు చేసి రూ. 25 కోట్ల 41 లక్షల వ్యయం గల బోనస్ ను రైతుల ఖాతా లో జమచేయుటం జరిగిందని అన్నారు. సన్నబియ్యం పంపిణీ పథకం: 70 ఏళ్లుగా పిడిఎస్ వ్యవస్థ పేద ప్రజల ఆహార భద్రతకు భరోసా ఇస్తోంది.అదే స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీని ప్రారంభించామని రాష్ట్రం లో 13 వేల కోట్ల రూపాయల వ్యయంతో, 3 కోట్ల 10 లక్షల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని జిల్లాలో 3 లక్షల 26 వేల 57 ఆహారభద్రత కార్డుదారులకు జూన్, జులై మరియు ఆగస్టు,2025 గాను 18 వేల 766 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయడం జరిగినదని అన్నారు. రేషన్ కార్డు.ప్రజల ఆత్మగౌరవానికి ఒక భరోసా భావోద్వేగం.రాష్ట్ర వ్యాప్తముగా ఈ ఏడాది జూలై 14న మన జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి నందు రాష్ట్ర ముఖ్యమంత్రి.రేవంత్ రెడ్డి నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించడం జరిగిందని పదేళ్ల తర్వాత చేతిలో రేషన్ కార్డుతో. రేషన్ షాపుల వద్ద సందడి కనిపిస్తోందని ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 36 వేల 812 కొత్త రేషన్ కార్డులను జారీ చేయడము జరిగినది మరియు వీటితో పాటు 70 వేల 932 సభ్యులు పేర్లను చేర్చడం జరిగిందని అన్నారు వరి ధాన్యం కొనుగోలు: జిల్లాలో 2024-25 యాసంగీ నందు(163) ఇందిరా క్రాంతి మహిళా సంఘాల,(144) ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల మరియు (15) మెప్మా సెంటర్ల మరియు(14) రైతు ఉత్పత్తిదారుల సంస్థ కొనుగోలు కేంద్రాలు మొత్తం (336)కొనుగోలు కేంద్రాల ద్వారా 3 లక్షల 36 వేల 847 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ను 59 వేల 273 మంది రైతుల నుండి కొనుగోలు చేసి రూ.783 కోట్లు రైతుల బ్యాంకు ఖాతా లోకి జమ చేయడం జరిగిందని వివరించారు. వ్యవసాయ శాఖ (అగ్రికల్చర్): రైతు భరోసా పథకం, ఇందిరమ్మ రైతు భరోసా కింద ఎకరానికి రూ.12 వేల పెట్టుబడి సాయం ప్రకటించాం.పరిమితులు లేకుండా ప్రతి రైతుకు ఈ పథకం కింద సాయం చేశామని జూన్ 16న ప్రారంభించి కేవలం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతుల ఖాతాల్లో వెయ్యడం జరిగిందని రాష్ట్రంలోని 70 లక్షల,11వేల,184 మంది రైతులకు ఈ సాయం అందించాం.కొత్తగా దరఖాస్తు చేసుకున్న ఒక లక్ష 2 వేల మంది రైతులకు కూడా పెట్టుబడి సాయం అందించడం జరిగింది మరియు జిల్లాలో 2 లక్షల 87 వేల 234 మంది రైతుల ఖాతా లోకి రూ.366 కోట్ల 50 లక్షలు చెల్లించనైనదని తెలిపారు. రైతు రుణమాఫీ పథకం. గత ఏడాది ఇదే ఆగస్టు 15న రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టామని రాష్ట్రంలోని 25 లక్షల 35 వేల మంది రైతులకు,రూ.20 వేల 616 కోట్ల రుణమాఫీ చేసి ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం రాయని కొత్త చరిత్ర రాశామని ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా,గత పాలకుల పాపాలు శాపాలై వెంటాడుతున్నా.రైతుల విషయంలో రాజీ పడలేదని. తెలంగాణ రైతును రుణ విముక్తి చేసి,దేశంలో అత్యధిక పంట పండిచే దిశగా ప్రోత్సహించామని జిల్లాలో ఒక లక్ష 27 వేల 269 మంది రైతులకు రూ.1,005 కోట్ల రుణ మాఫీ చేయటం జరిగిందని వివరించారు.రైతు బీమా పథకం జిల్లాలో 2024-25 సంవత్సరములో ఇప్పటి వరకు 817 మంది చనిపోయిన రైతుల నామినీలకు రూ.35 కోట్ల రూపాయల సొమ్ము చెల్లించనైనదని అన్నారు. ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ (హర్టీ కల్చర్) జిల్లాలో ఆయిల్
పామ్ మొక్కలు,తోట యాజమాన్యం ఖర్చులు మరియు డ్రిప్ ఇరిగేషన్ కొరకు ఎకరానికి గరిష్టంగా రూ.50,918/రాయితీగా అందిస్తున్నదని 2024-25 ఆర్ధిక సంవత్సరము వరకు మన జిల్లాలో 4,885 ఎకరాలలో ఆయిల్ పామ్ తోటలు పెట్టించడం జరిగినదని ప్రస్తుత ఆర్ధిక సంవత్సరమునకు 116 మంది రైతులకు 468 ఎకరాలలో ఆయిల్ పామ్ మొక్కలు నాటించడం జరిగిందని అన్నారు.నీటిపారుదల మరియు ఆయకట్టు అభివృద్ది ఇరిగేషన్ శాఖ జిల్లాలో మొత్తముగా 5 లక్షల 85 వేల 464 ఎకరాల ఆయకట్టు కలదని అన్నారు.ఎత్తిపోతల పథకాల పనులు:రూ.33 కోట్ల 83 లక్షలతో పాలకీడు మండలం, బెట్టతండా వద్ద గల మూసి నది పై బెట్టతండా ఎత్తిపోతల పధకము, రూ.47 కోట్ల 64 లక్షలతో కోదాడ మండలం,రెడ్ల కుంట గ్రామం వద్ద గల పాలేరు వాగు నుండి రెడ్లకుంట మేజర్ కాలువకు రెడ్లకుంట ఎత్తిపోతల పధకమును ఏర్పాటు చేయు పని మంజూరైంది రూ.5 కోట్ల 30 లక్షలతో అనంతగిరి మండలం,శాంతినగర్ గ్రామం వద్ద పాలేరు వాగుపై గల ఉత్తమ్ పద్మావతి ఎత్తిపోతల పధకమును పునరుద్ధరణ చేయుపని,రూ.37 కోట్ల 70 లక్షలతో చింతలపాలెం మండలం వద్ద గల నక్కగూడెం ఎత్తిపోతల పధకంలో గల పంపులు,మోటర్లకు మరమ్మత్తులు చేయుట మరియు శిథిలమైన పుస్సీ పైపు లైన్ స్థానములో మాస్ పైపు లైన్ ఏర్పాటు చేయు పనులు మంజూరైనవి.ఇట్టి 4 పనులు టెండర్లు దశలో ఉన్నవని రూ.ఒక కోటి 3 లక్షల తో హుజూర్ నగర్ కోదాడ నియోజకవర్గంలో గల చిన్న ఎత్తిపోతల పథకాలు ఆపరేషన్ అండ్ మెన్టేనన్స్ గురించి పనులు మంజూరు అయ్యాయని ఇట్టి 2 పనులు టెండర్ల దశలో ఉన్నవి.రూ.3 వందల 94 కోట్ల10 లక్షల తో చింతలపాలెం మండలం, బుగ్గ మాధవరం గ్రామం వద్ద చివరి ఆయకట్టు రైతులకు నీరు అందించుటకు రాజీవ్ గాంధీ ఎత్తి పోతల పథకం పని మంజూరు అయినదని ఇట్టి పనికి సంబందించిన అంచనాలు సాంకేతిక అనుమతి దశలో ఉన్నదని తెలిపారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ లైనింగ్ పనులకు రూ.29 కోట్లు, ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులకు రూ.184 కోట్ల 60 లక్షలు, జాన్ పహడ్ బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులకు రూ.52 కోట్ల11లక్షలు నిధులు మంజూరైనావనీ జాన్ పహడ్ బ్రాంచ్ కెనాల్ ఎత్తిపోతల పథకం కొరకు రూ.173 కోట్లు మరియు ఆర్ 9 ఎత్తిపోతల పథకం కొరకు రూ.8 కోట్ల 45 లక్షలు నిధులు మంజూరైనవి. ఇట్టి పనులు పురోగతిలో ఉన్నయాని ముక్త్యాలబ్రoచ్ కెనాల్ ఎత్తిపోతల పథకము కొరకు రూ.1,541 కోట్ల నిధులు మంజూరైనవి.అమరవరం ఎత్తిపోతలు,రేవూరు,బుగ్గమాదరం ఎత్తిపోతలు,ఎల్-27 మరియు ఎల్-29 ఎత్తిపోతలు, చింతలపాలెం మండలం, మట్టంపల్లి మండలం, గరిడేపల్లి మండలం పథకములకు సంబందించిన మరమ్మతు పనుల కొరకు రూ.7 కోట్ల 15 లక్షల నిధులు మంజూరైనవి. ఇట్టి పనులు పురోగతిలో ఉన్నయాని అన్నారు. మూసి ప్రాజెక్టు కాలువల ఆధునీకరణ పనులు: రూ.88 కోట్ల 76 లక్షలు అంచనా వ్యయం తో మూసీ ప్రాజెక్టు కాలువల ఆధునీకరణ పనులు మంజూరైనవని ఇప్పటివరకు రూ. 56 కోట్ల 17 లక్షల రూపాయల పనులు జరిగినవి,మిగిలిన పనులు పురోగతిలో ఉన్నయాని పేర్కొన్నారు.చెక్ డ్యామ్ నిర్మాణ పనులు: జీ.ఓ నెం.8 ద్వారా (20)చెక్ డ్యామ్ లకు రూ.124 కోట్ల 47 లక్షలు మంజూరు కాగా పనులు పురోగతిలో ఉన్నయాని అలాగే జీ.ఓ. నెం.766 ద్వారా రూ. 120 కోట్లు మంజూరుతో (19) చెక్ డ్యామ్ లు పూర్తి అయినవని వివరించారు.ఆపరేషన్ & మెయింటెనెన్స్ పనులు: జి. ఓ.నెం.45 నకు అనుగుణముగా కాలువల అత్యవసర మరమ్మతుల నిమిత్తం 2023-24 మరియు 2024-25 ఆర్ధిక సంవత్సరములలో రూ.14 కోట్ల12 లక్షలతో (52) పనులను మంజూరు చేయడము జరిగినదని ఇందులో (11) పనులను రూ.2 కోట్ల 23 లక్షలతో పూర్తి చేయడమైనది మిగిలిన పనులు పురోగతిలో ఉన్నయాని తెలిపారు.ఇందిరమ్మ ఇండ్లు పథకం తొలి విడతగా రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని అవన్నీ శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయాని దీనికి రూ.22,500 కోట్లు వెచ్చిస్తున్నామని.గ్రీన్ ఛానెల్ లో నిధులు విడుదల చేస్తున్నామని ఒక్క ఏడాదిలో నాలుగు లక్షల 50 వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయబోతున్నా (మని) జిల్లాలో 12 వేల 868 ఇళ్లు మంజూరు చేయబడ్డాయని ఇప్పటివరకు 1050 గృహములు వివిధ దశలలో నిర్మాణము లో ఉన్నయని వాటికి 22 కోట్ల రూపాయలు లబ్దిదారుల ఖాతాలో జమ చేయడం జరిగిందని.తెలిపారు హుజుర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో రామస్వామి గుట్ట వద్ద 1 బిహెచ్ (2160) గృహంలో నిర్మాణము,మిగిలి పోయిన పనుల నిర్మాణం పూర్తి చేయుట కొరకు రూ.74 కోట్ల 80 లక్షలు మంజూరు అయినవని,ఇప్పటివరకు (1792) గృహంలు పూర్తి కాబడి మిగిలినవి పురోగతిలో గలవు అని తెలిపారు. విద్యుత్ రంగం రాష్ట్రం లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ లో భాగంగా 29 లక్షల పంపు సెట్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని దీని కోసం రూ.16 వేల, 691 కోట్ల సబ్సిడీని విద్యుత్తు సంస్థలకు చెల్లిస్తున్నామని జిల్లాలో గల 1 లక్ష 57 వేల 530 మంది వ్యవసాయ వినియోగదారులు ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని పొందుతున్నారని దీని కోసం రూ. 906 కోట్ల సబ్సిడీని విద్యుత్తు సంస్థలకు చెల్లించడం జరిగిందని తెలిపారు 200 యూనిట్ల ఉచిత విధ్యుత్: జిల్లాలో గృహ జ్యోతి పథకం క్రింద జనవరి 2025 నుండి ఇప్పటివరకు ఒక లక్ష 83 వేల 170 మంది లబ్ధిదారులకు రూ.39 కోట్ల 29 లక్షలు సబ్సిడీతో ఉచిత కరెంటు సరఫరా చేయడం జరిగినదిని అన్నారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ చేయూత పెన్షన్లు ప్రభుత్వం జిల్లాలో సామాజిక భద్రతా పథకం క్రింద వికలాంగులు, వృద్దాప్య, వితంతు, ఒంటరి మహిళ, కల్లుగీత,చేనేత కార్మికులకు, ఆర్ట్ ఫైలేరియా, డయాలసిస్ వంటి మొత్తం ఒక లక్ష 43 వేల 367 మంది పెన్షనర్లకు 2025-26 ఆర్దిక సంవత్సరమునకు గాను రూ.64 కోట్ల 81 లక్షల పెన్షన్లను అందించుట జరుగుచున్నదని వీటిలో వికలాంగులైన పెన్షనర్లకు రూ.4,016/మరియు అర్హత కలిగిన ఇతర పెన్షనర్లకు రూ. 2,016/అందించబడుతుందని తెలిపారు. మహిళ స్వయం సహాయక సంఘాల ద్వారా స్వయం ఉపాధి పొందుట కొరకు 14 రకాల ఆదాయ అభివృద్ధి కార్యక్రమములో భాగముగా 3,669 యూనిట్లకు గాను రూ. 2 కోట్ల 30 లక్షల నిధులు ఎన్ఆర్ఎల్ఎం నుండి మంజూరి అయినవి.వీటిలో మైక్రో ఎంటర్ ప్రైజెస్,పశు ఆధారిత జీవనోపాధులు,కోళ్ల పెంపకం,చేపల పెంపకం,మహిళా క్యాంటిన్ ల యూనిట్లకు లబ్ధిదారులను గుర్తించి గ్రౌండింగ్ చేయడం జరిగిందిని సోలార్ విద్యుత్ ఉత్పాదకతలో భాగము కావడం,పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయుటకు కృషి చేయుట జరిగిందని 726 మహిళా సంఘ సభ్యులలలో మహిళా టైలర్స్ కు స్కూల్ యునీ ఫామ్ కుట్టుటకు రూ.29 లక్షల రూపాయల ఇవ్వడం జరిగింది.జిల్లాలో మహిళా శక్తి భవన్,రూ.5 కోట్లతో మంజూరు చేయబడి పనులు పురోగతిలో ఉన్నాయని అన్నారు.మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం:జిల్లాలో ఒక లక్ష 34 వేల జాబ్ కార్డులు పొంది 2 లక్షల 25 వేల మంది పని చేయగా 28 లక్షల 12 వేల పనిదినాలు కల్పించడం జరిగిందని దీనికి గాను ఇప్పటి వరకు రూ.72 కోట్ల 49 లక్షలు చెల్లించగా సామాగ్రి కూర్పునకు గాను రూ.41 కోట్ల 44 లక్షలు చెల్లించడం జరిగిందని నూతన స్వయం సహాయక సంఘాల గ్రూపులు:జిల్లాలో కొత్తగా 7 వేల 820 సభ్యులతో 213 సంఘాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.బ్యాంకు లీకేజీ ఈ ఆర్ధిక సంవత్సరములో ఇప్పటివరకు 1,424 సంఘాలకు రూ.176 కోట్ల ఋణాలు అందించడం జరిగిందని పేర్కొన్నారు.వడ్డీలేని ఋణాలు 12,717 మహిళా స్వయం సహయక సంఘాలకు రూ.36 కోట్ల 79 లక్షల ఋణ రాయితీని సంఘాల ఖాతా లో జమ చేయడం జరిగిందని అన్నారు.స్త్రీ నిద ఈ పథకం క్రింద రూ.19 కోట్ల 45 లక్షలు ఇప్పటి వరకు మంజూరు చేయడం జరిగినది, లోన్ భీమా ద్వారా 58 మందికి 88 లక్షల రూపాయలు మరియు ప్రమాద భీమా ద్వారా 6 గురికి 6 లక్షల రూపాయలు పంపిణి చేయడం జరిగినదని తెలిపారు. విద్యాశాఖ జిల్లాలో మొత్తం 1,261 పాఠాశాలలో 1,36,515 మంది ప్రభుత్వ జిల్లా పరిషత్ ఎయిడెడ్ మరియు ప్రవేట్ పాఠశాల యందు విద్యార్థినీ విద్యార్థులు చదువుతున్నారని. 2025-26 విద్యా సంవత్సరములో బడిబాట కార్యక్రమంలో భాగంగా 12,090 మంది విద్యార్ధులు నూతంగా ప్రభుత్వ పాఠశాలలో చేరడం జరిగిందని కేజీబీవీ.భవిత కేంద్రాలలో మరమ్మత్తులు అలాగే రేనోవేషన్ (41) పనులకు గాను రూ.5 కోట్ల 61 లక్షలు మంజూరు కాబడి పనులు పురోగతిలో గలవని 2025-26 విద్యా సంవత్సరములో గతములో మూతబడిన 7 పాఠశాలలను రీఓపెన్ చేయడం జరిగిందని తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాలలు: జిల్లాలో,అమ్మ ఆదర్శ పాఠశాలల కింద 584 పాఠశాలలు ఎంపిక చేయబడినవి.అందున 560 పాఠశాలల పనులు పూర్తి చేయడం జరిగిందని మిగిలిన పాఠశాలలు పురోగతిలో ఉన్నాయని అట్టి పాఠశాలలకు రూ. 20.40 కోట్లు మంజూరు కాబడి రూ. 14 కోట్ల 50 లక్షలు ఖర్చు చేయబడినవని వివరించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ జిల్లాలోని
హుజూర్ నగర్ నియోజక వర్గంలో గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లి గ్రామము నందు కోదాడ నియోజక వర్గంలో చిలుకూరు మండలంలోని సీతరాంపురం గ్రామము నందు మరియు తుంగతుర్తి నియోజక వర్గంలో తిరుమలగిరి మండలంలోని తొండ గ్రామము నందు నూతనంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు చేయడం జరిగింది.అంచనా విలున ఒక్కంటికి 200 కోట్ల చొప్పున మొత్తం 600 కోట్లు మంజూరు కాబడినవని తెలిపారు
అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ యాక్ట్ జిల్లాలో హుజూర్ నగర్ మునిసిపాలిటి నందు రామస్వామి గుట్టలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ను ప్రభుత్వం మంజూరు చేస్తూ (6) రకముల కోర్స్ ల యందు మొత్తం 172 సీట్లు కేటాయించడం జరిగింది మరియు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతున్నదని అన్నారు. భూ భారతి చట్టం అమలులోనికి తీసుకురావడం ద్వారా జిల్లాలో రెవెన్యూ సదస్సులను ప్రతిష్టాత్మకంగా నిర్వహించి రైతుల నుండి స్వీకరించిన (47,477) అర్జీలలో,ఇప్పటివరకు (10,556) అర్జీలను విచారణ పూర్తి చేసి (1,161) రైతులను అర్హులుగా గుర్తించనైనదని ఈ చట్టం ద్వారా ఇప్పటి వరకు పరిష్కారం చూపని సాదాబైనామా ధరఖాస్తులు (25,310)కొత్తగా అసైన్మెంట్ పట్టాల (4,583) కొరకై వచ్చిన ధరఖాస్తులను విచారించి పరిష్కరించడం జరుగుతుందని అలాగే అప్పీల్స్ చేసుకునే వ్యవస్థ కూడా కల్పించబడినదని తెలిపారు.వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖా జిల్లాలో 23 పీహెచ్ లు 122 పల్లె దవాఖానాలు,(04) పట్టణ ఆరోగ్య కేంద్రాలు,(161) ఆరోగ్య ఉప కేంద్రాలు మరియు (01)జనరల్ ఆసుపత్రి,(03) ఏరియా ఆసుపత్రి, (01) చచ్చి ల ద్వారా ప్రజలకు సేవలు అందించ బడుతున్నాయని అన్నారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలు: జిల్లాలోని కొత్త మండలాలైన మద్దిరాల, పాలకవీడు మరియు చింతలపాలెం లకు నూతన పీహెచ్ లను, హుజూర్ నగర్ మరియు కోదాడ మునిసిపాలిటీ లకు నూతన యూపీ హెచ్ లను మంజూరు చేయటం జరిగినది.మునగాల మండలం నందు నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనం మార్చి 2025 లో ప్రారంభోత్సవం జరిగి ప్రజలకు అందుబాటులో వున్నదని తెలిపారు.నిక్షయ్ శివిర్ జాతీయ క్షయవ్యాధి నివారణ:జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమములో జిల్లా లోని 161 ఉపకేంద్రాల పరిధిలో టి.బి.నిక్షయ్ శివిర్ 100 రోజుల కార్యక్రమాన్ని 7 డిసెంబర్ 2024 న ప్రారంభించి 13,697 మొబైల్ ఎక్స్ రే లను నిర్వహించి,జిల్లా వ్యాప్తంగా ఉన్న వల్నరబుల్ పాపులేషన్ స్క్రీన్ చేయడం జరిగిందని 7033 మందికి నిక్షయ్ పోషకాహార కిట్లు 6 నెలలకు సరిపడా అందించి మన జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. మాత శిశు సంరక్షణ కార్యక్రమం:
మాత శిశు సంరక్షణ కార్యక్రమం లో భాగంగా అమ్మలాలనా అనే ఒక డెస్క్ ని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మరియు వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్ లో స్థాపించడం జరిగిందని అన్నారు.ఆరోగ్య శ్రీ కాంగ్రెస్ బ్రాండ్ స్కీం.మసకబారిన ఈ పథకానికి పూర్వవైభవం తెచ్చాం.బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆరోగ్య శ్రీ పరిధిని రూ.5 నుండి 10 లక్షలకు పెంచడం జరిగిందని జిల్లాలో గడిచిన ఏడాది కాలంలో 20 వేల 63 మందికి శస్త్ర చికిత్సలు అందించగా ఇందుకు గాను రూ.23 కోట్ల 41 లక్షలు ఖర్చు చేయడం జరిగిందని వివరించారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్సా మాజిక ఆరోగ్య కేంద్రం తుంగతుర్తి మరియు కోదాడ (30) పడకల నుండి (100) పడకల స్థాయిగా పెంచుతూ ఏరియా హాస్పిటల్ గా ఉత్తర్వులు జారీ చేయడం జరిగినదని హుజూర్ నగర్ మరియు కోదాడ వైద్యశాలల యందు సిటి స్కాన్ త్వరలో ప్రారంబించుటకు సిద్ధంగా ఉన్నదని కోదాడ ఆసుపత్రి నందు కిడ్నీ కి సంబందించిన రోగులకు డయాలసిస్ యూనిట్ ప్రారంబించి ఇప్పటి వరకు మొత్తం 3 వేల 777 మందికి డయలసిస్ సేవలు అందించుట జరిగిందని అలాగే హుజూర్ నగర్ వైద్యశాల యందు నవజాతి శిశు వైద్య చికిత్సలు అందుబాటులోకి తీసుకొచ్చి ఇప్పటి వరకు 112 మంది పిల్లలకు వైద్య సేవలు అందించుట జరిగినదని అన్నారు.ప్రభుత్వ మెడికల్ కాలేజ్జ నరల్ ఆసుపత్రి &జిల్లా కేంద్ర ఆసుపత్రి (జిఎంసి & జిగ్) 2025-26 విద్యా సంవత్సరంలో అబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ,ఏంటి ఆర్థోపెడిక్స్,పాథాలజీ, అనస్థీషియా పీడియాట్రిక్స్,పల్మోనాలజీ విభాగాల నందు ఒక్కోదానికి 4 సీట్లు కేటాయించడం జరిగిందని తెలంగాణ ప్రభుత్వం సహకారంతో సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ లో అధునాతన ల్యాబ్ సేవలను ఏర్పాటు చేశారని జిల్లా ప్రజల ఆరోగ్య పరిరక్షణ మరియు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుసంధానంగా 100 పడకల ఏరియా హాస్పిటల్ ను 400 పడకల ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ గా ఉన్నతీకరించడం జరిగిందని ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుసంధానంగా నూతన బోధనా ఆసుపత్రి భవనం నిర్మాణం జరుగుతోందని అన్నారు. తెలంగాణ వైద్య సేవలు మరియు మౌళిక వసతుల అభివృద్ది సంస్థ ప్రభుత్వం వైద్యం రంగంలో ప్రాముఖ్యతనిస్తూ జిల్లాలో బోధన ఆసుపత్రి నిర్మాణం,నర్సింగ్ కళాశాల భవనము,క్రిటికల్ కేర్ బ్లాక్ (సిసిబి),నూతన కేంద్ర ఔషధ గిడ్డంగి భవనం,ప్రాంతీయ వైద్యశాల భవనములు,ఆసుపత్రి మరమ్మతులు మరియు నూతన పల్లె దవాఖానలు నిర్మాణాల కొరకు రూ.338 కోట్ల 45 లక్షలు నిధులు మంజూరు అయి పనులు పురోగతిలో ఉన్నయాని వివరించారు.తెలంగాణ రాష్ట్ర విద్యా మరియు సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ది సంస్థ
జిల్లా నందు ప్రభుత్వ ఐటిఐ, జూనియర్,డిగ్రీ,పాల్ టెక్నిక్ కాలేజీలు,జిల్లా గ్రంధాలయ భవనం,డా.బి.ఆర్ అంబేద్కర్ భవనం అదనపు తరగతి గదులు, నూతన భవిత సెంటర్స్ నిర్మాణాలకు రూ.74 కోట్ల19 లక్షల అంచనా విలువతో మంజూరు చేయడం జరిగినది మరియు పనులు పురోగతిలో ఉన్నాయి అన్నారు.రోడ్లు మరియు భవనాలు జిల్లాలో వివిధ గ్రాంట్ ల క్రింద 68 పనులకు గాను రూ.776 కోట్ల 91 లక్షలు మంజూరు కావడం జరిగిందని పనులు వివిద దశలలో పురోగతి లో కలవని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ద్వారా రూ.10 కోట్ల తో కోదాడ పట్టణ పరిధి లో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మంజూరు చేయబడిందని అన్నారు.పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా వివిధ పథకాలు అగు క్సర్,మారర్, అండఫ్ మరియు ఆరోగ్య ఉప కేంద్రం నిధుల ద్వారా (385) పనులకు గాను 261 కోట్ల 58 లక్షల రూపాయలు మంజురై (89) పనులు పూర్తయినవి మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయని వివరించారు.పారిశ్రమలు టి.జి ఐ-పాస్:జిల్లాలో 2025-26 సంవత్సరములో 43 పరిశ్రమలు 74 అనుమతులు పొంది రూ.91 కోట్ల 67 లక్షల పెట్టుబడి తో 385 మందికి ఉపాధి కల్పించ బడుచున్నదని టి-ప్రైడ్:2025-26 సంవత్సరములో ఎస్సీ,ఎస్టీ మరియు వికలాంగుల అభ్యర్థులకు మొత్తం 137 యూనిట్లకు గాను రూ.9 కోట్ల 57 లక్షల పెట్టుబడి రాయితీ మంజూరు చేయబడినవని తెలిపారు. పీ.ఎం.ఈ.జీ.పీ:2025-26 సంవత్సరములో 13 యూనిట్లకు 63.74 లక్షలు రాయితీ మంజూరు చేయబడి 21 మందికి ఉపాధి కల్పించబడినదని అన్నారు. జిల్లా రవాణా శాఖ ఎలక్ట్రాక్ వాహనలకు పన్ను మినహాయింపు: జిల్లాలో ఇప్పటివరకు 2 వేల 404 నమోదు చేసుకున్న ఎలక్ట్రాక్ వాహనాలకు పన్ను మినహాయించడం జరిగింది. మెరుగైన ప్రజా రవాణా సేవాల కోరకు ఆర్.టి.సి సంస్థ 79 ఎలక్ట్రాక్ బస్సులు ఉపయోగంలోకి తీసుకురావటము జరిగినదని తెలిపారు.షెడ్యూల్ కులాల అభివృద్ధి మరియు సంక్షేమం ఈ ఆర్ధిక సంవత్సరంలో పోస్ట్-మెట్రిక్ ఉపకార వేతనములు, వసతి గృహముల నిర్వహణ & మరమ్మతుల కొరకు మరియు అంబేద్కర్ ఓవర్ సీస్ విద్యానిధి పథకము క్రింద మరియు కాస్మోటిక్ చార్జీల నిమ్మిత్తం మొత్తం రూ. 4 కోట్ల 24 లక్షలు మంజూరు చేయనైనదని పేర్కొన్నారు. గిరిజన సంక్షేమం ఈ విద్యా సంవత్సరమునకు పాఠశాల & కళాశాలల వసతి గృహముల నిర్వహణకు,పోస్ట్ మెట్రిక్,ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలకు,అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకమునకు మరియు కాస్మోటిక్ చార్జీల నిమ్మిత్తం మొత్తం రూ.11 కోట్ల 62 లక్షలు మంజూరు చేయనైనదని అన్నారు.వెనకబడిన తరగతుల సంక్షేమం ఫ్రీ మెట్రిక్ & పోస్ట్ మెట్రిక్ వసతి గృహములకు,కాస్మోటిక్ చార్జీల నిమ్మిత్తం అలాగే ఉపకార వేతనముల క్రింద రూ.3 కోట్ల 73 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగినదని అన్నారు కాటమయ్య రక్షా సేఫ్టీ కిట్స్:కల్లుగీత కార్మికుల ప్రత్యేక అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆధునిక భద్రతా లక్షణాలతో పూర్తి రాయితీపై కాటమయ్య రక్షా పేరిట జిల్లాలో 2 వేల 35 కిట్స్ పంపిణీ చేయడము జరిగినదని తెలిపారు.మైనారిటీ సంక్షేమం మెస్ చార్జీలు మరియు బోధన రుసుములకు,వృత్తి నైపుణ్య శిక్షణ మరియు ఉపాది పథకం ద్వారా వివిధ రకాల శిక్షణకు విదేశీ ఉపకార వేతనాలకు మరియు కాస్మోటిక్ చార్జీల నిమిత్తం మొత్తం.రూ 8 కోట్ల 17 లక్షలు మంజూరు చేయనైనదని అన్నారు.. ఆకట్టుకున్న సాంస్కృతి కార్యక్రమాలు తదుపరి టి జి ఎస్ ఆర్ డబ్ల్యూ ఎస్,వైష్ణవి పాఠశాల,బాల భవన్ జడ్పీహెచ్ ఎస్ చివ్వెంల విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను మంత్రి వీక్షించి ప్రతి ఒక్కరితో ఫోటోలు దిగి విద్యార్థులను ప్రోత్సహించారు స్వతంత్ర సమరయోధులకి ఘన సన్మానం. గరిడేపల్లికి చెందిన గంట లక్ష్మారెడ్డి, నడిగూడెంకి చెందిన,బిక్షమయ్య, స్వతంత్ర సమరయోధులను మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి,జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవార్ జిల్లా ఎస్పీ కె నరసింహ,తో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి రాంబాబు, జడ్పీ సీఈవో వివి అప్పారావు, ఆర్డీవో వేణు మాధవరావు, పరిపాలన అధికారి సుదర్శన్ రెడ్డి, జిల్లా ఉన్నత అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..