జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం
పయనించే సూర్యుడు జూలై 10 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
రాష్ట్ర రాజకీయాల్లో 60 సంవత్సరాల సుదీర్గ రాజకీయ చరిత్ర కలిగిన మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై సుమారు 200 మందిపై దాడి చేయడం, ఇంట్లో ఉంటున్న ప్రజలపై దాడి చేసే ఉద్దేశ్యంతో ఇలా జరగడం రాజకీయాలకు ఇది చీకటిరోజు అని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు.జిల్లా వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో బుధవారం మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు మేకపాటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీ మేరిగ మురళీలతో కలసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎంతో చరిత్ర రాజకీయ చరిత్ర కలిగిన నెల్లూరులో ఇప్పటి వరకు ఇలాంటి ఘటనలు జరగలేదన్నారు. దేశానికి ఉప రాష్ట్రపతిగా వ్యవహరించినముప్పవరపు వెంకయ్యనాయుడు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించారని, అలాంటి ఘన చరిత్ర కలిగిన నెల్లూరులో గతంలో లేని విధంగా ఇళ్లపై దాడులు జరగడం ఎప్పుడూ చూడలేదన్నారు.2008 సంవత్సరంలో రాజ్యసభ, లోక్ సభ నుండి 8 మంది ఎంపీలకు నెల్లూరు నుంచి ప్రాతినిధ్యం వహించారని, నెల్లూరు జిల్లాకు చెందిన అనేక మంది దేశ విదేశాల్లో పారిశ్రామికంగా. వైద్యపరంగా. వ్యాపారవేత్తలుగా ఉన్నారని, వారి గృహాలు నెల్లూరులోనే ఉన్నాయని, అలాంటి నెల్లూరు ప్రజలు ఇలాంటి దాడి ఘటనలు చూసిన అనంతరం ఇక్కడ ఉంటున్న వారి తల్లిదండ్రులు, బంధువుల భద్రతపై ఆందోళనకు గురయ్యే పరిస్థితి కలిగించారన్నారు. దాడి ఘటనకు సంబంధించి పూర్తి ఆధారాలు మా వద్దనున్నాయని, ఇంటిపై దాడి చేసిన వారు ముందుగా ఇంట్లోని సీసీ కెమెరాలను ధ్వంసం చేశారని, సమీపంలో నివాముంటున్న కొంత మంది వారు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగిందని అన్నారు. టీడీపీ నాయకులు దాడి ఘటనను బహిరంగంగా ఒప్పుకుంటున్నారని అన్నారు. ఇలాంటి ఘటన చేసిన వారిపై జిల్లా ఎస్పీ, కలెక్టర్ వెంటనే స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు.ఈ ఘటనపై న్యాయం జరగకపోతే అనంతరం జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో గమనించాలని, దాడి ఘటన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, రెండు రోజుల్లోగా అన్ని పూర్తి ఆధారాలు సమర్పిస్తామని వారిపై తప్పకుండా చర్యలు తీసుకుని బాధ్యతులపై చర్యలు తీసుకుని న్యాయం జరిగేలా చూడాలని అన్నారు.కూటమి ప్రభుత్వంలో ఉన్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఈ ఘటనపై గట్టి చర్యలుతీసుకోవాలని కోరుతున్నామని అన్నారు.