జమ్మికుంటలో జర్నలిస్టుపై దాడి – మీడియా వర్గాల్లో ఆగ్రహం..
పయనించే సూర్యుడు, సెప్టెంబర్ 22, కుమార్ యాదవ్ కొంగల, హుజురాబాద్ ఆర్ సి..
జమ్మికుంటలో సోమవారం జరిగిన ఘటన మీడియా వర్గాలను తీవ్ర కలచివేసింది. స్థానిక జర్నలిస్ట్ కుమార్ యాదవ్ కొంగల పై బిఆర్ఎస్ నాయకుడు పోలునేని సత్యనారాయణ దాడి చేసి బెదిరించినట్లు సమాచారం. అంబులెన్స్ అడ్డంగా నిలిచిన వాహనాలను క్లియర్ చేస్తూ, ఆ విజువల్స్‌ను రికార్డ్ చేస్తున్న సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడి వాహనాల ముందు నిలబడి వీడియో తీస్తుండగా, సత్యనారాయణ వచ్చి జర్నలిస్టు చేతిలోని ఫోన్‌ను గుంజుకొని, "నిన్ను చంపేస్తా" అంటూ బెదిరించినట్టు బాధితుడు తెలిపారు.ఈ సంఘటనను చూసిన స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మీడియా వర్గాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ — “జర్నలిస్టులపై దాడులు అంగీకారయోగ్యం కావు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభమైన మీడియాను ఇలాంటి రీతిలో బెదిరించడం దారుణం. రాజకీయ నాయకులు రౌడీలా వ్యవహరిస్తే ఎలా?” అంటూ ప్రశ్నించారు.“మీడియా పై దాడులు జరిగితే ఊరుకోము” అని స్పష్టం చేశారు.