పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇన్చార్జి ఆగస్టు 7
అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం లో ప్రపంచ ఆదివాసి దినోత్సవం ఆగస్టు 9న పురస్కరించుకొని ఆదివాసి సంక్షేమ పరిషత్ ఈనెల ఒకటో తేదీ నుంచి ప్రతి ఆదివాసి గూడెంలో ఆదివాసి నవోత్సవాలను నిర్వహిస్తుంది ఈ సందర్భంగా గురువారం నాడు ఎటపాక మండలం లక్ష్మీపురం గ్రామంలో ఏర్పాటుచేసిన ఆదివాసి చైతన్య సదస్సుకి ఆదివాసి సంక్షేమ పరిషత్ (274/16) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఆదివాసి రాజకీయ పార్టీలకు అతీతంగా ఐక్యమై ఆదివాసి హక్కులు చట్టాల కోసం పోరాడాలని ప్రపంచ ఆదివాసి దినోత్సవం ఆగస్టు 9 యొక్క ఉద్దేశం కూడా ఆదివాసుల తమ హక్కుల్ని కాపాడుకోవాలని సూచిస్తుందని ఆయన అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసి చట్టాలు ఉల్లంఘించి గిరిజనఏతరులు వలసలు రావటం తోటి వాళ్లతో పాటు నాన్ ట్రైబల్ రాజకీయ పార్టీలు ఏజెన్సీ ప్రాంతాల్లోకి చొరబడి ఆదివాసీల ఐక్యతను దెబ్బతీశాయని. నాన్ ట్రైబల్స్ పార్టీలు, నాన్ ట్రైబల్స్ ఏజెన్సీ ప్రాంతానికి చొరబడకముందు ఆదివాసీలంతా ఐక్యంగా మమేకమై జీవించేవారని. నేడు నాన్ ట్రైబల్స్ కుట్రల తోటి ఆదివాసిలంతా విచ్చినమైపోయి పార్టీలకు బానిసలుగా, నాన్ ట్రైబల్ కి తొత్తులుగా బతుకుతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. ఇలాంటి విభజించు పాలించు కుట్రల వలన ఆదివాసీలు తమకు తెలియకుండానే భారత రాజ్యాంగం ద్వారా ఆదివాసులకు కల్పించబడ్డ చట్టాలు నీరు గారి పోతున్నాయని హక్కులు హరించిపోతున్నాయని సంస్కృతి అంతరించిపోతుందని ఆయన అన్నారు. దీని కారణంగా ఆదివాసీల అభివృద్ధి రక్షణ మనుగడ ప్రశ్నార్ధకంగా మారిందని ఇప్పటికైనా ఆదివాసీలందరూ ఒకే తాటిపైకి వచ్చి నాన్ ట్రైబల్స్ కుట్రల నుండి, రాజకీయ పార్టీల బానిసత్వం నుండి విముక్తి పొంది చైతన్యవంతులై ఆదివాసి హక్కుల కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికి కూడా ఆదివాసులు మేల్కొనకపోతే భవిష్యత్ తరాల ఆదివాసులకు మనుగడ ఉండదని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వాలు ఆదివాసులకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అన్ని హక్కులను ఆదివాసులకు దక్కే విధంగా కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ యం పి టి సి పోడియం క్రిష్ణ, తెల్లం జంపన్న, సొందే రమేష్ వార్డ్ మెంబర్, మీడియం సురేశ్ వార్డ్ మెంబర్, కణితి రాజు పూజారి, మడకం వెంకటేష్, సవలం లక్ష్మణ్, ఉయిక సింగయ్య తదితరులు పాల్గొన్నారు