పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 13.09.2025 చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ oచౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) మండలంలోని సత్య ప్రమాణాలకు పేరుగాంచిన రాజనాల బండపై శనివారం సత్య ప్రమాణాలు జోరుగా కొనసాగించారు ఉదయాన్నే టీటీడీ టెంపుల్ ఇన్ స్పెక్టర్ భాను ప్రకాష్ ఆధ్వర్యంలో ప్రధానఅర్చకుడు కృష్ణమూర్తి చే ప్రసన్నా ఆంజనేయ స్వామి మరియు లక్ష్మీ నరసింహ స్వామికి విశేష పూజలు నిర్వహించారు తరువాత చిత్తూరు మరియు బంగారుపాలెం బి.కొత్తకోట నిమ్మనపల్లి మండలం బండ్లపై మొదలగు గ్రామాల నుంచి ప్రమాణాలకు హాజరు అయినారు కొందరు ప్రమాణాలు చేయగా మరికొందరు వాయిదా వేసుకుని వెళ్లారు గత వారంలో ప్రమాణలు కువచ్చిన వారికి ప్రమాణాలు చేయక మునుపే రూ 50వేలు రికవరీ అయినట్లు టెంపుల్ ఇన్ స్పెక్టర్ భాను ప్రకాష్ తెలియజేశారు ఈకార్య క్రమంలో భక్తులు ఆలయాన్ని దర్శించి ఆంజనేయ స్వామికి పూజలు అందించారు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు