పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 22(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి శ్రీ పెద్దమ్మ తల్లికి ఆశ్వీజ మాస శుద్ధ పాడ్యమి సోమవారం మొదటి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం ఉదయం సుప్రభాత సేవ గంగా స్నానం పట్టు వస్త్రాల సమర్పణ పంచామృతాభిషేకం హోమాది కార్యక్రమాలు నైవేద్య సమర్పణ మహా మంగళహారతి శాస్త్రోపవేతంగా వేద పండితుల సమక్షంలో పెద్దమ్మ తల్లి ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు దాదాపుగా 600 మందికి పైగా భక్తులు రావడం తీర్థ ప్రసాద స్వీకరించడం జై పెద్దమ్మతల్లి అని నినాదాలతో ఆలయ అంగనమంతా మారు మోగింది సాయంత్రం 6 గంటలకు కుంకుమార్చన మణిద్వీప వర్ణన భక్తి పాటలతో భజన కార్యక్రమం పంచహారతులు మొదలైన తీర్థ ప్రసాదాల కార్యక్రమాలు ఉంటాయని పెద్దమ్మ తల్లి ఆలయ వృద్ధి కమిటీ వారు తెలియజేశారు నవరాత్రుల్లో మొదటి రోజున పెద్దమ్మ తల్లికి 21 కేజీల కంచు గంట తయారు చేయించడం జరిగింది