షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్"
( పయనించే సూర్యుడు ఆగస్టు 20 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
మాజీ ప్రధాన మంత్రి, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా షాద్ నగర్ మున్సిపల్ పరిధిలోని ఫరూఖ్ నగర్ క్రాస్ రోడ్ వద్ద గల రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… స్వర్గీయ మాజీ ప్రధాన మంత్రి రాజీవ్‌గాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన కుటుంబం మొత్తం దేశానికి, దేశ ప్రజల సేవలకే అంకితమైందన్నారు. ప్రధానిగా రాజీవ్‌గాంధీ అనేక సంస్కరణలు తెచ్చి దేశాన్ని అభివృద్ధి చేశారన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్,పట్టణ అధ్యక్షుడు కొంకళ్ళ చెన్నయ్య, నేతలు అగ్గనూర్ బస్వo, చెంది తిరుపతి రెడ్డి, ఇబ్రహీం, రఘు నాయక్,శ్రీనివాస్ యాదవ్, అందే మోహన్ ముదిరాజ్,బాబా అలీ ,బాలరాజు గౌడ్, శ్రీకాంత్ రెడ్డి,శ్రీను నాయక్,సురేష్ రెడ్డి, వీరశం, నీరటి వాసు, జగదీశ్, సీతారాం,శ్రీనివాస్, ముబారక్ అలీ ఖాన్, ఖదీర్, బచ్చలి నరేష్, తుపాకుల శేఖర్, శేఖర్,మసూద్ ఖాన్,షఫీద్దీన్, సాయి కిరణ్, రాజేష్ గౌడ్,, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.