పయనించే సూర్యుడు నంద్యాల జిల్లా రిపోర్టర్ జి పెద్దన్న
నంద్యాల అసెంబ్లీ పరిధిలోని పంచాయితీ, వార్డు నాయకులతో సమావేశమై ఏ ఏ వార్డులలో,పంచాయతీలలో పోటీ చేయాలి అని అభ్యర్థులు ఎవరు ఉండాలి అనే దానిపై చర్చ నిర్వహించిన నాయకత్వం.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ నాయకులు హుస్సేన్ పీరా ముఖ్యఅతిథిగా పాల్గొని నంద్యాల అసెంబ్లీ పరిధిలోని నాయకుల మరియు కార్యకర్తల నుండి స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయడానికి దరఖాస్తులు స్వీకరించారు.రాష్ట్ర ఉపాధ్యక్షులు అతావుల్లా ఖాన్ మాట్లాడుతూ సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ఉద్భవించి ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తూ ముందుకు సాగుతుందని అదేవిధంగా నంద్యాలలో కూడా గత 15 సంవత్సరాలుగా ఎన్నో రకాలుగా ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజల సమస్యల కోసం నిరంతరం గళమెత్తుతూ ముందుకు సాగుతుందని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు ఎస్టిపిఐ పార్టీ అభ్యర్థులను బలపరిచి, గెలిపించి మున్సిపాలిటీలకు, పంచాయతీలకు పంపిస్తే ఇంకా ఎక్కువగా ప్రజా శ్రేయస్సు కోసం పార్టీ పనిచేస్తుందని తెలిపారు.హుస్సేన్ పీరా మాట్లాడుతూ నంద్యాల అసెంబ్లీ పరిధిలోని వార్డు, పంచాయతీ నాయకులు మరియు కార్యకర్తలకు ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయడానికి దరఖాస్తులు స్వీకరించామని, ఈ దరఖాస్తుల పై చర్చించి అర్హులైన అభ్యర్థులను స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎజాస్ హుస్సేన్ మాట్లాడుతూ నంద్యాల పరిధిలోని చాలా వార్డులలో మరియు మేజర్ పంచాయతీలలో పోటీ చేయడానికి పార్టీ సిద్ధంగా ఉందని పార్టీ నాయకులు,కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.నంద్యాల అసెంబ్లీ అధ్యక్షులు వి హనీఫ్ మాట్లాడుతూ నిరంతరం ప్రజల కోసం పనిచేసే మరియు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేసె ఎస్టిపిఐ పార్టీని రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో గెలిపించాలని ప్రజలకు కోరారు.ఈ సమావేశంలో అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి మక్బూల్ బాషా, అసెంబ్లీ నాయకులు ఈశ్వర్ రెడ్డి,సులేమాన్, మాజీద్ ఖాన్,రిజ్వాన్ ఆలం, సుల్తాన్, కరిముల్లా తదితరులు పాల్గొన్నారు.