
పయ నించే సూర్యుడు జూన్ 23 (ముమ్ముడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రగతి పథంలో ముందుకు పన్నెండేళ్లు అభివృద్ధి ప్రస్థానం కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యువమోర్చ అధ్యక్షులు గాణాల కళ్యాణ్ ఆధ్వర్యంలో రామచంద్రపురం నియోజవర్గం రామచంద్రపురం పట్టణం ఆర్టీసీ కాంప్లెక్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ మరియు భారతీయ జనతా పార్టీ అనకాపల్లి జోనల్ ఇన్చార్జ్ కర్రి చిట్టిబాబు, జనసేన ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు సుభాష్ మాట్లాడుతూ మోడీ గారి నాయకత్వంలో దేశం మరింత ముందుకు అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో యువమోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి గనిశెట్టి అరవింద్,జిల్లా యువమోర్చ ప్రధాన కార్యదర్శి తోలేటి సూర్య గంగాధర్, ఉపాధ్యక్షులు రాయుడు మణికంఠ, కోటిపల్లి దామోదర్, కార్యదర్శి వెచ్చా దుర్గా ప్రసాద్,వలపశెట్టి కిరణ్,కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి నాగిరెడ్డి సతీష్ రావు,ఏఎమ్ సి చెర్మన్ రిషి, డైరెక్టర్ రాఘవేంద్ర,సీనియర్ నాయకులు కొట్టువాడ హరిబాబు,టౌన్ ప్రెసిడెంట్ దునే శ్రీను,అన్వర్ మరియు బీజేపీ తెలుగుదేశం జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.