
పయనించే సూర్యుడు ఆగస్టు 9 నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న
తిరుపతి జిల్లా కేంద్రంలోని రాయలసీమ స్టూడెంట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు బందెల ఓబులేసు గారి ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా ఆర్ఎస్ఏ నూతన జిల్లా కమిటీ వేయడం జరిగింది. జిల్లా అధ్యక్షులు గా జ్యోతి ప్రకాష్ ప్రధాన కార్యదర్శి గా మహేష్ ను ఎన్నుకోవడం జరిగింది.ఈ సందర్భంగా రాయలసీమ స్టూడెంట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు బందెల ఓబులేష్ మాట్లాడుతూ, రాయలసీమ అస్తిత్వం కోసం విద్యార్థిని విద్యార్థులు పోరాటాలు కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. అందులో భాగంగానే ఈరోజు తిరుపతి జిల్లా కేంద్రంలోని కొత్త కమిటీ వేయడం జరిగిందని ఆయన తెలిపారు. అంతేకాకుండా వెనుకబడిన రాయలసీమ అభివృద్ధి కోసం విద్యా వైద్య రంగాలలో అభివృద్ధి చేయాలని కోసం పోరాటం చేయాలనీ పిలుపునిచ్చారు. అంతేకాకుండా విద్యార్థులు నాయకత్వ లక్షణాలు ఏర్పరచుకోవాలని సమాజం పట్ల శ్రద్ధ వహించి విద్యార్థులు విద్యార్థుల సమస్యల పైన పోరాడాలని ఆయన తెలియజేశారు. అంతేకాకుండా ఈ రోజుల్లో విద్యార్థులు డ్రగ్స్ మద్యం మాఫియా లాంటి చెడు వ్యసనలు కు దూరంగా ఉండాలని వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకూడదని ఆయన పిలుపునిచ్చారు. ఆయన అన్నారు. దేశ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలు యువతతో ప్రారంభమవుతాయని అందుకు కారణంగా విద్యార్థి దశ నుండే ఉద్యమ లక్షణాలు అలవాటు చేసుకోవాలని విద్యార్థిని విద్యార్థులకు పిలుపునివ్వడం జరిగింది.అంతేకాకుండా సంక్షేమా హాస్టల్లో ని విద్యార్థుల కోసం త్వరలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దాదాపు 6400 కోట్ల రూపాయలు అన్ని కాలేజీలకు పెండింగ్ లో ఉన్నాయని కాలేజీల కు చెల్లించకుండా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో పాఠశాలను సంక్షేమ హాస్టల్లో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని వాటి సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో రాయలసీమ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యల పైన భారీ ఎత్తున ఉద్యమాలు చేపడతామని తెలియజేశారు.కాబట్టి రాయలసీమ లో వెనుకబడినటువంటి అన్ని రంగాల్లో ముందుకు కొనసాగేలా ఉద్యమాలను మరింత ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రేమ్ హరీష్ మదన్ వినయ్ మూర్తి నవీన్ ధనుష్ హేమంత్ రాజ్ కుమార్ జయరాజ్ ప్రియదర్శన్ పాల్గొన్నారు.
