- ఇద్దరు నిందితుల అరెస్ట్.. పరారీలో మరొకరు
- రూ.46 లక్షల విలువైన 30 వాహనాలు స్వాధీనం
హైదరాబాద్ సిటీ: రాయల్ ఎన్ఫీల్డ్ బైక్(Royal Enfield bike)లనే లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగల ముఠా ఆటకట్టించారు రాచకొండ పోలీసులు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 46 లక్షల విలువైన 30 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్లోని క్యాంపు కార్యాలయంలో రాచకొండ సీపీ సుధీర్‌బాబు(Rachakonda CP Sudheer Babu) మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.