
పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్10(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
అంతర్జాతీయ బాలిక దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 11వ తేదీన నిర్వహించబడుతుంది సి.డి.పి.ఓ. ఆదేశాల మేరకు యాడికి మండల పరిధిలోని రాయలచెరువు సెక్టార్ సూపర్వైజర్ శంషాద్ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా బాలికలకు విద్య పోషణ చట్టపరమైన హక్కులు, వైద్య, సంరక్షణ హింస బలవంతపు బాల్య వివాహాల పై వివక్షత అవగాహన పెంచడం మరియు బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను నివారించి వారి హక్కులను తెలియజేయడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా బాలికలు ఎదుర్కొంటున్న లింగ అసమానతలు వివక్షత పై అవగాహన పెంచడం బాలికలు యువతులు వారి వారి రంగాలలో ప్రచారం పరిశోధనలకు సంబంధించి సాధించిన అభివృద్ధిని ప్రతిబింబించేలా ఈ అంతర్జాతీయ బాలిక దినోత్సవం ను జరుపుకోవడమైనది, ఈ కార్యక్రమానికి హెల్త్ సూపర్వైజర్, హెల్త్ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.