
విద్యార్థులకు గ్యాస్ సిలిండర్, అగ్ని ప్రమాదాలపై అవగాహన
( పయనించే సూర్యుడు ఏప్రిల్ 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
వాస్తవ విపత్తు సమయంలో భయాందోళనలకు గురికాకుండా, సురక్షితంగా బయటపడటానికి సిద్ధం చేయడమే మాక్ డ్రిల్ కార్యక్రమమని సిఐఎస్ఎఫ్ అధికారులు తెలిపారు.రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం రాయికల్ ప్రాథమిక పాఠశాలలో.. సిఐఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ దిలీప్ సోనావానే మరియు ఎస్ఐ వైబిబి రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు గ్యాస్ సిలిండర్ మరియు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమంలో భాగంగా వారి సిబ్బందితో ఒక మార్క్ డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్మాస్టర్ శారద.. మరియు పాఠశాల సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు..
