
బాన్సువాడలో హిందువులపై అక్రమ కేసులు బనాయించడం, కామారెడ్డిలో బిజెపి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణుల దాడి, రుద్రూర్లో మహిళా న్యాయవాదిపై మతోన్మాదుల దౌర్జన్యం… ఇవన్నీ రాష్ట్రంలో అడుగంటిన చట్టబద్ధ పాలనకు ప్రత్యక్ష నిదర్శనాలు.సీఎం శ్రీ Anumula Revanth Reddy గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న 'ఓటు బ్యాంకు' మరియు 'బుజ్జగింపు' రాజకీయాల వల్లే రాష్ట్రంలో తీవ్రవాద, అసాంఘిక శక్తులు పేట్రేగిపోతున్నాయి.నిందితులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకుని, రాష్ట్రంలో శాంతిభద్రతలను పునరుద్ధరించాలని, లేనిపక్షంలో బిజెపి పక్షాన రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని డీజీపీ గారికి స్పష్టం చేశాము.