రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమమే మా లక్ష్యం -ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి”
పయనించే సూర్యుడు అక్టోబర్ 24, నంద్యాల జిల్లా రిపోర్టరు జీ. పెద్దన్న
అభివృద్ధి, సంక్షేమం మా మంచి ఉమ్మడి ప్రభుత్వ లక్ష్యం.నంద్యాల జిల్లాలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి సుడిగాలి పర్యటనలతో మినరల్ వాటర్ ప్లాంట్లు, సిమెంట్ రోడ్లు ప్రారంభోత్సవం, భూమి పూజలు.రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం మా ఉమ్మడి ప్రభుత్వ లక్ష్యమని, సీఎం నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో రాష్ట్రం అన్నిరంగాల్లో ముందుకెలుతుందని, నంద్యాల జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళుతున్నామని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.శుక్రవారం నంద్యాల జిల్లాలోనీ నందికొట్కూరు, శ్రీశైలం, నంద్యాల, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి సుడిగాలి పర్యటనలతో ఎంపీ నిధులతో చేపట్టిన మినరల్ వాటర్ ఫ్లాంట్లు, సిమెంట్ రోడ్లను ప్రారంభించారు. మరికొన్ని పనులకు భూమి పూజలు చేశారు. నందికొట్కూరు నియోజకవర్గం లోని పగిడ్యాల మండలం భాస్కా పురం గ్రామంలో రూ. 5 లక్షలతో నిర్మించిన మినరల్ వాటర్ ఫ్లాంట్, జూపాడుబంగ్లా మండలం రామ సముద్రం గ్రామంలో రూ. 5 లక్షలతో నిర్మించిన మినరల్ వాటర్ ఫ్లాంట్, మండల కేంద్రమైన పాములపాడు ఎస్. సి కాలనీలో రూ. 5 లక్షలతో నిర్మించిన మినరల్ వాటర్ ఫ్లాంట్, శ్రీశైలం నియోజకవర్గం మహానంది మండలం శ్రీనగర్ గ్రామంలో రూ. 5లక్షలతో నిర్మించిన మినరల్ వాటర్ ఫ్లాంట్, పాణ్యం నియోజకవర్గం కొండజూటూరు గ్రామంలో రూ. 5 లక్షలతో నిర్మించిన ఆర్ ఓ ఫాంట్లను ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. అదేవిధంగా నంద్యాల ఎన్ జీ ఓ కాలనీలో ఏరో కిడ్స్ మాడల్ స్కూల్ ను ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రారంభించారు. అలాగే పాణ్యం మండలం మద్దూరు గ్రామం లో రూ. 5లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డు, మండల కేంద్రం పాణ్యంలోని దొంగు రస్తా రూ. 9 లక్షలతో పూర్తి చేసిన సిమెంట్ రోడ్డు ను ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రారంభించారు.ఈ కార్యక్రమాల్లో రైల్వే జోనల్ వినియోగదారుల సలహా కమిటీ మెంబర్ తరిగోపుల నాగేశ్వరావు,బి ఎస్ ఎన్ ఎస్ టెలికామ్ సంస్థ సలహాకమిటీ సభ్యులు కురువ రమేష్. పాణ్యం శ్రీనివాస యాదవ్, సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ నరహరి విశ్వనాధ్ రెడ్డి, పాములపాడు టీడీపీ నాయకులు గాండ్ల రవి. గాండ్ల సురేష్ .కే వెంకటేశ్వర్లు. టేకూరి సాయి. అన్వర్ భాష. పాములపాడు సర్పంచ్ భాగ్యమ్మ. రాజశేఖర్. కురువ ఎల్లయ్య. సాయికుమార్. మిట్టకందాల చింతల కుమార్, పాణ్యం మండలం మద్దూరు గణపం పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.