* రాష్ట్రంలో పోలీస్ శాఖ మాత్రమే పని చేస్తుందని ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఫైర్.
*కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో ఒక్క రూపాయి అభివృద్ధి జరగలేదు
.*వ్యవసాయరంగం పూర్తిగా నిర్లక్ష్యం అయిందన్నారు
* అక్రమా కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.
*చండూరులో జరుగుతున్న పనులన్నీ బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన
.*మునుగోడు ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు మేము ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తూ పనులు మంజూరు ఇచ్చాము.
*చండూరులో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి.
పయనించే సూర్యుడు న్యూస్ చండూరు జులై 04కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో ఒక్క రూపాయి అభివృద్ధి జరగలేదు. రాష్ట్రంలో పోలీస్ శాఖ మాత్రమే పని చేస్తుందని ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఫైర్ అయ్యారు.కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో ఒక్క రూపాయి అభివృద్ధి జరగలేదు. కానీ, వందలాది కేసులు పెడుతున్నారు. రాష్ట్రంలో పోలీస్ శాఖ మాత్రమే పని చేస్తుందని ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఫైర్ అయ్యారు. నల్లగొండ జిల్లా చండూరులో మీడియా సమావేవంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నించన వారిపై అనేక అక్రమ కేసులు పెడుతుంది. చండూరు మున్సిపల్ చైర్మన్ ఇల్లు కూల్చి వేశారు. ఇలా కేసులు పెట్టి భయపెట్టి ఓట్లు వేయించుకుందాం అనుకుంటున్నారని మండిపడ్డారు. పనులు లేక బీఆర్ఎస్ చేసిన పనులకే కొత్తగా బోర్డులు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కొత్తగా తెచ్చి వేసిన రోడ్డు లేదు.వ్యవసాయరంగం పూర్తిగా నిర్లక్ష్యం అయిందన్నారు. తెలంగాణ వచ్చే నాటికి నల్లగొండ అఖరులో ఉంటే..కెసిఆర్ పాలనలో అగ్రస్థానం లో నిలిచిందని గుర్తు చేశారు. ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చేశా. కానీ మళ్లీ కాంగ్రెస్ పాలనలో నకిలీ విత్తనాలు విచ్చలవిడిగా వస్తున్నాయని ఆరోపించారు. నిన్నటి రివ్యూ మీటింగ్ లో వాళ్ల ఎమ్మెల్యేలే అంటున్నారు. ఇదేం సమీక్షా అని. మంత్రులు మాత్రమే మాట్లాడితే మేం ఎందుకు అని ఎమ్మెల్యేలు అనుకుంటున్నారన్నారు. కొంత మంది ప్రజా ప్రతినిధులు పోలీసల నుంచి మామూళ్లు తీసుకోవడం దురదృష్టకరమన్నారు. ఉత్తమ్ నీటి పారుదల, సివిల్ సప్లై శాఖ లపై అవగాహన లేదు.ఇవ్వాళ చండూరులో జరుగుతున్న పనులన్నీ బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చినవే. మునుగోడు ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చందుకు మేము ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తూ పనులు మంజూరు ఇచ్చాము. మునుగోడులో ఇప్పుడు అక్కడక్కడా జరుగుతున్న పనులన్నీ కెసిఆర్ హయాంలోనివేనని స్పష్టం చేశారు. కమీషన్స్ కోసం బిల్లులు ఆపడం కాంగ్రెస్ నేతలకే చెల్లిందన్నారు.మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి, పార్టీ నేతలు పాల్వాయి స్రవంతి, రెగట్టే మల్లికార్జున రెడ్డి, మాజీ చైర్మన్ తోకల చంద్రకళ వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.