( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 4 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ మెగావత్ నరేందర్ నాయక్ )
మహబూబ్నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఎంపి కప్ రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో షాద్నగర్ కు చెందిన యాదవ్ బుడోఖాన్ కరాటే క్లబ్ విద్యార్థులు పాల్గొని ఉత్తమ ప్రతిభను కనబరిచారు. విద్యార్థులు వివిధ విభాగాల్లో పాల్గొని ఐదు బంగారు పథకాలు మరియు నాలుగు వెండి పతకాలు మూడు రజిత పథకాలు గెలుపొందడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఉమ్మడి మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందించడం జరిగింది గెలుపొందిన విద్యార్థులకు యాదవ్ బుడోకన్ కరాటే క్లబ్ డిప్యూటీ గ్రాండ్ మాస్టర్ సాయినాథ్ మరియు సీనియర్ మాస్టర్ నరేందర్ నాయక్ ఉత్తేజ్ గోపి వినయ్ పిరు తదితరులు అభినందించారు