రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో రాణించిన జస్వికా రాథోడ్, రాహుల్, చైతన్
అభినందించిన స్కూల్ యజమాన్యం
పాల్గొన్న సీనియర్ కరాటే మాస్టర్ నరేందర్ నాయక్*
( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 15 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో జరిగిన రాష్ట్రస్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో షాద్ నగర్ పట్టణంలోని మాగ్నెట్ స్కూల్ ఆప్ ఎక్సలెన్స్ చెందిన విద్యార్థులు పాల్గొని ఉత్తమ ప్రతిభను కనబరిచారు. పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న జస్వికా రాథోడ్ కటాస్ విభాగంలో రెండవ స్థానం సాధించగా, ఏడో తరగతి చదువుతున్న రాహుల్ కటాస్ విభాగంలో మొదటి బహుమతిని అందుకున్నాడు. అదేవిధంగా ఐదవ తరగతి చదువుతున్న చైతన్య కుమితే ( స్పైరింగ్ ) విభాగంలో మొదటి బహుమతిని గెలుపొందడం జరిగింది. గెలుపొందిన విద్యార్థులకు ఛాంపియన్షిప్ నిర్వాహకులు బాలరాజు మాస్టర్ మరియు అహ్మద్ ఖాన్ సర్టిఫికెట్ మరియు మెడల్స్ అందజేశారాని కరాటే సీనియర్ మాస్టర్ నరేందర్ నాయక్ తెలిపారు. గెలుపొందిన విద్యార్థులకు స్కూల్ యజమాన్యం ఈరోజు ఘనంగా సన్మానించడం జరిగింది. కరాటే లో ఉన్నత స్థాయికి చేరాలని, ప్రతి విద్యార్థి కరాటే నేర్చుకోవాలని స్కూలు కరస్పాండెంట్ మహమ్మద్ వాజిద్ పాషా అన్నారు. చదువుతోపాటు కరాటే విద్యార్థులకు ఎంతో ముఖ్యమని గత కొన్ని సంవత్సరాల నుంచి తమ స్కూల్లో విద్యార్థులకు కరాటే నేర్పించడం జరుగుతుందని ఉన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ వాజిద్ పాషా, స్కూల్ కరికులం డైరెక్టర్ వినోద్, స్కూల్ ప్రిన్సిపల్ ఆనంద్, వైస్ ప్రిన్సిపల్ ఆసిఫ్, కరాటే మాస్టర్ నరేందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.