
పయ నించే సూర్యుడు జనవరి 24 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
కాట్రేనికోన, :
తండ్రిని మించిన తనయుడు యువనేత, రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ బాబు పుట్టిన రోజు వేడుకలను మత్స్యకార కార్పొ రేషన్ మాజీ చైర్మన్ నాగిడి నాగేశ్వర రావు ఆధ్వర్యంలో కాట్రేనికోనలో ఘనంగా నిర్వ హించారు. తొలుత నాగిడి నాగేశ్వర రావు కేక్ కట్ చేసి అభిమానులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ చైర్మన్ నాగిడి నాగేశ్వర రావు వేగుళ్ళ మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు ఎంత కృషి చేస్తున్నారో లోకేష్ అంతకు మించిన కృషి చేస్తూ తండ్రిని మించిన తనయుడిగా ఎదుగు తున్నారన్నారు. భావితరాల్లో ఆయన మరింత ప్రత్యేకమైన పాత్ర పోషించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు, ఎక్కడ వెనకడుగు వేయకుండా యువగళం పేరుతో పాదయాత్ర చేశారని ఆయన గుర్తు చేశారు. అవహేళనలు లెక్క చేయకుండా రాటు తేలి ఈనాడు ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్నారని కొనియాడారు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న నాయకుడని పేర్కొన్నారు. రాష్ట్ర విద్యాశాఖ,ఐటి శాఖ మంత్రి,యువ నేత నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కూటమి నాయకుల ఆధ్వర్యంలో కాట్రేనికోన ప్రాదమిక ఆరోగ్య కేంద్రంలో పేషంట్లకు పండ్లు అందజేశారు. ఈ కార్యక్రమలలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి నాగిడి నాగేశ్వర రావు, కాట్రేనికోన మండల టిడిపి అధ్యక్షుడు చెల్లి సురేష్.పి సడా డైరెక్టర్ విత్తనాల బుజ్జి, తెలుగు యువత అధ్యక్షుడు వంగా దుర్గా బాబు, నాయకులు మోకా అప్పాజీ,బండారు యేసు, నూకల మోహన్, కముజు లక్ష్మీ రమణారావు, ఎస్.వెంకట వెంకటేశ్వర రావు, విత్తనాల రమణ,గెద్దాడ శ్రీను, కాలాడి వీరబాబు, బొమ్మిడి లింగేశ్వర రావు, రాగుర్తి సత్తి బాబు పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.