
పయనించే సూర్యుడు గాంధారి 26/11/25
రాష్ట్ర స్థాయి అండర్ 14 వాలీబాల్ పోటీలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెట్ సంగం కు చెందిన ముగ్గురు విధార్థిని ఎంపిక అయినట్లు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు కుమార స్వామి తెలిపారు, ఈ నెల 24 న నిజామాబాద్ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ క్రీడా మైదానమూలో జరిగిన ఎంపిక పోటీలో అద్భుతంగా ఆడిన దివ్య శ్రీ,,దీపికా, అమ్ములు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయినట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ రాథోడ్ తెలిపారు.ఇదే నెల 26. నుండి 28 వరకు పెద్దపల్లి జిల్లాలో జరిగే 4పోటీలో వీరు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జట్టు కు ప్రాతినిధ్యం వహిస్తారు. ఎంపీల అయిన విదార్థులకు పాఠశాల ఉపాధ్యాయ బృందం గ్రామస్థులు అభినందనలు తెలియారు..