పయనించే సూర్యుడు. మార్చి 10 ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూర్ ప్రధాన రోడ్డుపై యువకుడి మృతదేహంతో రాస్తారోకో చేసిన సంఘటనలో 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. టియల్ పేట ఇందిరానగర్ కాలనీ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో టిఎల్ పేటకు చెందిన పసుపులేటి కృష్ణ అనే యువకుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. యువకుడి మృతికి టాటా ఏసీ వాహనపు ఓనర్ అయినటువంటి శేఖర్ కారణమని ఆరోపిస్తూ మృతుడి బంధువులు శేఖర్ ఇంటిదగ్గర గొడవ చేసి డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేయటం, బెదిరించటం, అదే వ్యవహారంపై ఏన్కూర్ ప్రధాన రోడ్డుపై రాస్తారోకో చేసి ట్రాఫిక్ కు అంతరాయం కలిగించటం, తదితర సంఘటనలకు సంబంధించి తొమ్మిది మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రఫీ తెలిపారు.