పరమార్శించిన ఎమ్మెల్సి నవీన్ రెడ్డి
షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మల్లికార్జున్ కు పరమార్శ
( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 20 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
షాద్ నగర్ cmytv రిపోర్టర్ మల్లికార్జున్ ఇటీవల ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదానికి గురై షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సి నవీన్ రెడ్డి రిపోర్టర్ మల్లికార్జున్ ను పట్టణ స్థానిక నాయకులతో కలిసి ఆసుపత్రిలో పరమార్శించారు.ఈ సందర్బంగా ప్రయాణ సమయల్లో జాగ్రత్తగా ఉండాలని పరిసరాలను గమనిస్తూ ప్రయాణం చేయాలని మనోదైర్యం కల్పించారు ఎమ్మెల్సి నవీన్ రెడ్డి.మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.ఎమ్మెల్సి నవీన్ రెడ్డితో పాటు మాజీ కౌన్సిలర్స్ మాధురి నందకిషోర్,ఈశ్వర్ రాజు,జూపల్లి కౌశల్య శంకర్,పిళ్లి శారద శేఖర్,బీఆర్ఎస్ నాయకులు రఘునాథ్ యాదవ్, బిక్షపతి,పల్లె రఘునాథ్ రెడ్డి,భూపాల్ రెడ్డి,శేరి శ్రీనివాస్ రెడ్డి,జయంత్ రెడ్డి తదితరులు ప్రమార్శించారు.