
అద్యక్షులుగా ఓబ్లేష్,ప్రధాన కార్యదర్శిగా మ్యాతరీ నరసింహ లు ఎన్నిక
{పయనించే సూర్యుడు} ఏప్రిల్ 5మక్తల్
డా.బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సమక్షంలో నూతనంగా రుద్రసముద్రం గ్రామ కమిటీని ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం,మక్తల్ నాయకులు మాట్లాడుతూ మక్తల్ నియోజవర్గ కమిటీ గత 45 సం,,ల క్రితం ఏర్పడిన అంబేద్కర్ యువజన సంఘం గ్రామాల్లో అంటారినితనం నిర్మూలన,దళిత,పేద వర్గాల పిల్లల విద్యాభివృద్ధికి కృషి చేసిందని,అంతేకాకుండా గ్రామాల్లో ప్రజల సమస్యలపై అధికారుల,ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంపై గళమెత్తి వారి సమస్యల పరిష్కారానికి పోరాడిన అంబేద్కర్ యువజన సంఘానికి మక్తల్ నియోజకవర్గ ప్రాంతంలో గొప్ప పేరుందని,ఎన్నికైన కొత్త కమిటీ కూడా అలానే పనిచేసి పేరు తెచ్చుకోవాలన్నారు.
అంతేకాకుండా ఎన్నికైన కొత్త కమిటీ నిచ్చెన కుల వ్యవస్థ కుట్రల నిర్మూలనకు,దళితుల,మహిళల విద్య,సామాజిక సమానత్వనాకై తమ జీవితాలను త్యాగం చేసినా, మహానీయులు పూలే,అంబేద్కర్ ల గొప్పతనాన్ని తెలియచేసేలా వచ్చేనెలలో రాబోయే వారి జయంతులను గ్రామంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించలన్నారు.అదేవిధంగా మక్తల్ నియోజక వర్గ కమిటీ పిలుపు మేరకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ అంబేద్కర్ భావజాల చైతన్యాన్ని ముందుకు తీసుకుపోవాలన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కమిటీతో ప్రమాణస్వీకారం చేయించడం జరిగిందన్నారు.రుద్రసముద్రం అంబేద్కర్ యువజన సంఘం నూతన కమిటీ.తేదీ:04-04-2026 అంబేద్కర్ యువజన సంఘం రుద్ర సముద్రం నూతన కమిటీ అద్యక్షులు:ఓబులేశ్ ఉపాధ్యక్షులు: 1) బాలప్ప 2) విష్ణు ప్రధాన కార్యదర్శి: 1) నర్సింహ మ్యాతరి
సహాయ కార్యదర్శి:1) నర్సింలు నేరం కోశాధికారి: అంజప్ప సహాయ కోశాధికారి: లింగప్ప సాంస్కృతిక కార్యదర్శి:1) శివలింగప్ప సలహాదారులు: 1)శాంతప్ప 2) బర్ల లింగప్ప 3) లక్ష్మణ్ 4) మోనోజి 5) చంద్రాములు
కార్యవర్గ సభ్యులు: ఆంజనేయులు జనార్ధన్ పూజారి నవీన్ అనిల్ నరేందర్ పరమేశ్ శ్రీనివాస్ వెంకటేష్
లక్ష్మన్న లింగప్ప చిన్నన్న రాజు శంకర్ భీమేష్ రోహిత్ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ అధ్యక్షులు పృథ్వీరాజ్, మానవ హక్కుల కార్యకర్త మద్దిలేటి, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు తల్వార్ నరేష్, వేంకటపతి రాజు, రవికుమార్,గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
