రుద్రూర్, ఆగస్టు 29 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
గత రెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రుద్రూర్ గ్రామ చెరువు నిండుకుండలా మారి జలకళ సంతరించుకుంది. శుక్రవారం స్థానిక మండల కాంగ్రెస్ నాయకులు చెరువులు, తూములు, అలుగులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలకు వెళ్ళవద్దని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, మాజీ జడ్పిటీసి నారోజి గంగారం, నాయకులు పత్తి రాము, తోట సంగయ్య తదితరులు పాల్గొన్నారు.