
రుద్రూర్, డిసెంబర్ 18 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
రుద్రూర్ మండల కేంద్రంలో మటన్ మార్కెట్ కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మటన్ మార్కెట్ సంఘం అధ్యక్షులుగా న్యామ్తాబాద్ కళ్యాణ్ ను ఎన్నుకున్నారు. అందరూ ఏకంగా వుంటూ అందరూ ఒకే మాటమీద వ్యాపారాలు కొనసాగించి వినియోగదారులకు స్వచ్చమైన మటన్ ను ఇస్తూ ఒకే విధంగా ధరలు కూడా ఉండాలని, అందరూ వ్యాపారాలు సజావుగా సాగడానికి సమిష్టిగా ఉండడానికి బృందగా ఏర్పడి సంఘం అధ్యక్షులుగా న్యామ్తాబాద్ కల్యాణ్ ను, కార్యదర్శిగా ఎండి. శామీర్ ను ఎన్నుకున్నట్టు సంగం సభ్యులు తెలియజెశారు. ఈ సందర్బంగా అధ్యక్షులు, కార్యదర్శి మాట్లాడుతూ..సంఘం సభ్యులు ఎంతో నమ్మకంతో మాకు ఎన్నుకున్నందుకు సంఘ సభ్యులందరికి కృతఙ్ఞతలు తెలిపారు. సంఘ సభ్యుల ఆదేశాలను పాటిస్తూ సంఘం యొక్క అభివృద్ధికి తమవంతు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు ఎండి.ఇమ్రాన్, షఫీ, కటికే రాజు, శాకీర్, రాజారామ్, వాహాబ్, అక్తర్, యునుస్ తదితరులు పాల్గొన్నారు.