రుద్రూర్, మార్చ్ 12 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిది) : రుద్రూర్ మండల కేంద్రంలో బుధవారం రాత్రి కామదహనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గ్రామ గోశాల, యోగ కేంద్రం సభ్యులు తెలిపారు. రాత్రి నిర్వహించే కామదహన కార్యక్రమానికి మల్లారం శ్రీశ్రీశ్రీ పిట్ల కృష్ణ మహరాజ్ ముఖ్య అతిథిగా వస్తున్నారని పేర్కొన్నారు. కామ దహనం వేయడానికి ఆవు పిడకలు, గోమయ సమిధులు గోశాలలో లభిస్తాయని తెలిపారు. సనాతన సంప్రదాయబద్ధంగా నిర్వహించే కార్యక్రమానికి అధిక సంఖ్యలో రావాల్సిందిగా వారు కోరారు.