బస్టాండ్ ప్రాంగణంలో జన్మదిన వేడుకలను జరుపుకుంటున్న బీఆర్ఎస్ నాయకులు..
రుద్రూర్, మార్చ్ 13 (పయనించే సూర్యుడు రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ చౌటు వద్ద గురువారం ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటూ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల ఇంచార్జ్ గాండ్ల మధు, సాయి కిరణ్, హరీష్, కన్నే ప్రవీణ్, షేక్ షాదుల్, సాయా గౌడ్, వెంకటి, జువ్వల శ్రావణ్, క్లిక్ రవి తదితరులు పాల్గొన్నారు.