రుద్రూర్, జూలై 13 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
ఆషాడ మాస బోనాలను పురస్కరించుకొని రుద్రూర్ మండల కేంద్రంతో పాటు అంబం(ఆర్), చిక్కడపల్లి గ్రామాలలో ఆదివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. రుద్రూర్ గ్రామంలో వతాందర్ వీఆర్ దేశాయి ఆధ్వర్యంలో బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ బోనాల పండుగలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, డిసిసిబి మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిలు పాల్గొని బోనం ఎత్తుకున్నారు. భాజా భజంత్రీలతో, పోతురాజుల విన్యాసాలతో ఊరేగింపుగా అన్ని కుల సంఘాల మహిళలు బోనాలు ఎత్తుకుని గ్రామంలోని పోచమ్మ, మహాలక్ష్మి మందిరాలకు చేరుకొని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ ఇందూరు చంద్రశేఖర్, గ్రామ పెద్దలు బచ్చు రామ్ సేట్, నాయకులు పత్తి రాము, పత్తి లక్ష్మణ్, ఇందూర్ కార్తిక్, శ్రీధర్ గౌడ్, రీతు గౌడ్, కన్నె రవి, కర్క అశోక్, తోట సంగయ్య, తోట్ల గంగారాం, వివిధ పార్టీల నాయకులు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.