పశువులకు నివారణ టీకాలు వేస్తున్న దృశ్యం..
రుద్రూర్, ఏప్రిల్ 17 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
రుద్రూర్ మండల కేంద్రంలో గురువారం పాడి పశువులకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగిందని మండల పశు వైద్యాధికారి డాక్టర్ సంతోష్ అన్నారు. పశువులకు ఎలాంటి వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగిందన్నారు. 48 పశువులకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రైతులు తదితరులు పాల్గొన్నారు.