సరుకులు అందజేస్తున్న దృశ్యం…
రుద్రూర్, ఆగస్టు 15 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి)
గత రెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రుద్రూర్ మండల కేంద్రంలోని ఎరుకల గల్లి, బోయవాడలో నీట మునిగిన గృహాలను శుక్రవారం మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సందర్శించారు. బాధిత కుటుంబాలు బింగి సుజాత, గంగారాం, పెంట గంగామణి, లింగమణి, పెంట అనుజ, బెంగి ఎల్లవ్వలకు నిత్యావసర సరుకులు, ఆర్ధిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు షేక్ నిసార్, ఇందూర్ కార్తీక్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.