పయనించే సూర్యుడు మే05 (పొనకంటి ఉపేందర్ రావు )
ఇల్లందు ఆర్టీసీ డిపోలో నూతన బస్ సర్వీస్ లను ఇల్లందు ఎమ్మెల్యే . కోరం కనకయ్య ప్రారంభించారు. ఈ రెండు బస్సు సర్వీసులు ఎమ్మెల్యే కోరం కనకయ్య సోమవారంప్రారంభించారు. ఒక బస్సు కొత్తగూడెం, పాల్వంచ మీదుగా మణుగూరుకు. మరో బస్సు కొత్తగూడెం మీదుగా సత్తుపల్లి వరకు నడపనున్నారు. అనంతరం ఆర్టీసీ బస్సులో కొంత దూరం ప్రయాణించారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిత్యం పర్యవేక్షించాలని అధికారులను సూచించారు. కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే గారిని ఆర్టీసీ సిబ్బంది ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు డిపో మేనేజర్, డిపో కంట్రోలర్, ఆర్టీసీ సిబ్బంది, పట్టణ కాంగ్రెస్ నాయకులు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, మండల నాయకులు, యువజన నాయకులు, ఐ ఎన్ టి సి నాయకులు, యువజన విభాగం, మహిళా కమిటీ, తదితరులు పాల్గొన్నారు