విజయవాడ, జనవరి 6: రెరా అధికారులపై మంత్రి నారాయణ (AP Minister Narayana) ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తులు పెండింగ్లో పెట్టడంపై మంత్రి ఫైర్ అయ్యారు. ఏపీ రెరాలో పెండింగ్ దరఖాస్తులపై మంత్రి ఈరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రేరా అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెరాలో అనుమతుల కోసం నెలల తరబడి దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఈ విషయాన్ని మంత్రి దృష్టికి పలువురు బిల్డర్లు, డెవలపర్లు తీసుకొచ్చారు. ఎనిమిది నెలలుగా ఎందుకు దరఖాస్తులు పెండింగ్లో పెట్టారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే దరఖాస్తురాదులను వేధింపులకు గురి చేస్తునట్లు మంత్రికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని కొంతమంది అధికారుల తీరుపై మండిపడ్డారు. అంశాల వారీగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై మంత్రి నారాయణ ఆరా తీశారు. రెరా అధికారులతో నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి ఏపీ రెరాకు సంబంధించి అనేక వినతులు వచ్చాయని.. 167 దరఖాస్తులు షార్ట్ ఫాల్స్ పంపారని తెలిపారు. పరిష్కారం కావడంలేదని కొన్ని ఫిర్యాదులు వచ్చాయన్నారు.