పయనించె సూర్యుడు న్యూస్. ఆగస్టు 26. (గొలుగొండ మండల ప్రతినిధి ఎన్. చిరంజీవి) ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణలో ఎస్సీ –1 కింద రెల్లి ఉప కులాలకు కేటాయించిన 1 శాతం రిజర్వేషన్ వల్ల రెల్లి అభ్యర్థులు తీవ్ర నష్టపోతున్నారని మాల ఐక్య వేదిక జాతీయ అధ్యక్షులు దళపతి తిర్రే రవిదేవా తెలుపారని మెగా డీఎస్సీ రెల్లి అభ్యర్థుల కన్వీనర్ డా. నారాయణరావు కొన వెల్లడించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ మెగా డిఎస్సీ నియామకాలలో రెల్లి విద్యావంతులు అధికంగా ఉన్న కొన్ని జిల్లాలలో పోస్టులు తక్కువగా ఉండగా, పోస్టులు ఎక్కువగా ఉన్న ఇతర జిల్లాలలో అర్హులైన అభ్యర్థులు లేకపోవడంతో రెల్లి అభ్యర్థులు బ్యాక్‌లాగ్‌లో పడే పరిస్థితి ఏర్పడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులలో రెల్లి డిఎస్సీ అభ్యర్థులు అన్యాయానికి గురవకుండా లోకల్, నాన్ లోకల్ అనే పరిమితులు లేకుండా రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని అవకాశాలు కల్పించాలని అయన కోరారు. అర్హులైన అభ్యర్థుల పోస్టులు బ్యాక్లాగ్లోకి వెళ్లకుండా చూడాలని ప్రభుత్వంను డిమాండ్ చేస్తూ విజ్ఞప్తి చేశారు.