ఇక పిల్లలకు మొదలైన సంబరాలు..
పయనించే సూర్యుడు // జనవరి 11// హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ // కుమార్ యాదవ్..
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు, పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు శనివారం నుంచి సంక్రాంతి పండుగ సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. శనివారం నుంచి 17 వరకు ఏడురోజులపాటు పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. శనివారం నుంచి 16 వరకు ఆరురోజులపాటు జూనియర్ కాలేజీలకు సంక్రాంతి సెలవులుంటాయి. ఈనెల 18న పాఠశాలలు, 17న జూనియర్ కాలేజీల్లో తిరిగి తరగతులు ప్రారంభమవుతాయి.