పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్
రేపు తేదీ 18 .10 .20 25 శనివారం రోజున తెలంగాణ రాష్ట్ర సంపూర్ణ బంధుకు రాష్ట్ర బీసీ సంఘల ఐక్యత కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు మన బాల్కొండ నియోజకవర్గం స్థాయిలో అన్ని మండలములోని అన్ని గ్రామమాలలో బీసీ లకు 42 % రిజర్వేషన్లు విద్య, ప్రభుతువ్వ రాజకీయాలలో సాధన కోసం తమిళనాడు రాష్ట్రంలో కల్పించినట్లు కేంద్రం ప్రభుత్వం పార్లమెంట్ లో బిల్ ప్రవేశపెట్టి రాజ్యాంగములోని 9 వ షెడ్యూలులో పెట్టి బీసీ వర్గాలకు న్యాయం చెయ్యాలని డిమాండ్ తో మన బీసీ ల ఐక్యత కోసం కలిసి కట్టుగా బందు కు సహకారం చెయ్యాలని ఏర్గట్ల మండల బీసీ సెల్ కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇచ్చారు. రేపు బందు కు బీసీ లకు జరుగుతున్న అన్యాయాన్ని గమనించి జనాభా తమాషా ప్రకారం బీసీ లకు రావాల్సిన రిజర్వేషన్ కల్పించే విధముగా పూర్తి మద్దతు తెలుపాలని కాంగ్రెస్ బీసీ కమిటీ డిమాండ్ చేసినారు. మా బీసీ డిమాండ్ ఎవరికి వ్యతిరేకం కాదు, మాకు జరుగుతున్న అన్యాయం గురించి అర్థం చేసుకొని మా న్యాయమైన హక్కులను అడుగుతున్నాం. రేపు బందుకు అందరూ దయచేసి సహకరించాలని ఏర్గట్ల మండల బీసీల సంఘం కోరుతున్నది. ఈ బందుకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పిలుపు మేర ఏగట్ల మండల కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలుపుతుంది. అన్ని గ్రామములో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఈ బందు కు సహకరించాలి. ఇట్టి ప్రెస్ మీట్లో బీసీ నాయకులు దండవోయిన సాయి కుమార్,మునిమాణిక్యం అజయ్, జంగల గణేష్ ,రాగుల నగేష్,దొబ్బల చిన్న కిషన్ ,మెరుగు సురేష్, కల్లెడ పురుషోత్తం,ఏనుగంటి సాయి,కురకుల రమేష్,మాసం శివకుమారు,మినుములు సాగరు,పాకాల ప్రసాద్ గౌడ్,మదాస్తూ చినయ్య,పుల్లూరు గణేష్,తదితరులు పాల్గొన్నారు జై బీసీ - జై కాంగ్రెస్