పయనించే సూర్యుడు ఏప్రిల్ 5 నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్
తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో
రేపు శ్రీరామనవమి సందర్భంగా పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ బాల్కొండ నియోజకవర్గం లోని భీంగల్ మండలం పిప్రి గ్రామంలోని లొద్దిరామన్న ఆలయంలో వారి యొక్క తండ్రి అంకురార్పణ కార్యక్రమానికి మధ్యాహ్నం 12:00 గంటలకు విచ్చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా వస్తున్న మహేష్ కుమార్ గౌడ్ కి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, ప్రజ లు పెద్ద ఎత్తున ఆహ్వానం పలకాలని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు.
కార్యక్రమంలో అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, బ్లాక్ అద్యక్షులు, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు