
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో:స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో భాగంగా రేపు అనగా తేదీ 13 గురువారం ఉదయం 10 గంటలకు భైంసా లో భారీ తిరంగా ర్యాలీ జరగనుంది. బైంసా పట్టణంలో ఉదయం వేళ వ్యాపారులు యువకులు, పాఠశాల విద్యార్థులు పెద్ద మొత్తంలో వచ్చి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి బస్టాండ్ వరకు తిరంగా యాత్ర చేపట్టనున్నారు. ప్రతి ఒక్కరి చేతిలో తిరంగా జెండా పట్టుకొని వచ్చి దేశభక్తిని చాటి చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ పాల్గొననున్నారు. రాజకీయాలకతీతంగా చేపట్టి తిరంగా ర్యాలీలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఊరు ఊరు వాడ వాడల ఘర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని చేపట్టనున్నామన్నారు. యాత్రలో రాజకీయాలకతీతంగా నియోజకవర్గం లోని సర్పంచ్ లు నాయకులు ఉద్యోగులు యువకులు ప్రతి ఒక్కరు పాల్గొనవలసిందిగా ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.