పయనించే సూర్యుడు జనవరి 12
మంచిర్యాల్ జిల్లా మంచిర్యాల్ మండల్
రిపోర్టర్ (గొడుగు ఆశీర్ విల్సన్)
సంక్రాంతి పర్వదినం ని పురస్కరించుకొని రెవల్యూషన్ హై స్కూల్ లో విద్యార్థులు మరియు విద్యార్థి తల్లిదండ్రులు ముగ్గుల పోటీలు జరిగాయి.ఈ సందర్భంగా పిల్లల తో కలిసి తల్లిదండ్రులు కూడా ముగ్గుల పోటీలో పాల్గొన్నారు ఏర్పాటు చేసిన సంక్రాంతి గ్రామీణ సాంప్రదాయ కళా రూపాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
అలాగే మైదానం మొత్తం రంగు రంగుల ముగ్గులతో ఎంతో అందంగా ఆకర్షణీయంగా మారింది.
కాగా వేడుకలను ఉద్దేశించి పాఠశాల కరెస్పాండంట్ విష్ణువర్ధన్ రావు మాట్లాడుతూ "సంక్రాంతి అంటేనే సంబరాల నిలయం అని,ఈ పండుగను పిల్లలు పెద్దలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారని అన్నారు ఈ సంక్రాంతి నుండి రాత్రి సమయం తగ్గి,పగలు సమయం పెరుగుతుందని అన్నారు అంటే చీకట్లు తగ్గి వెలుతుర్లు పెరుగుతాయని అలాగే మనందరి జీవితాల్లో కూడా విజయాలనే వెలుతురు రావాలని దాని కోసం బద్దకం అనే చీకటి ని పారద్రోలి చురుకుదనం అనే వెలుతురు ని పొందాలని విద్యార్థులకు సూచించారు"కాగా ఈ వేడుకల్లో పాఠశాల సిబ్బంది తల్లిదండ్రులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు