పయనించే సూర్యుడు మే 25 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జూన్ 1 వ తేది నుండి రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేయవలసి ఉన్నందున శనివారం మండల కేంద్రమైన చేజర్ల తహసీల్దార్ కార్యాలయంలో రేషన్ షాప్ డీలర్లతో సమావేశం నిర్వహించడం జరిగింది. తహసీల్దార్ బి .మురళి మాట్లాడుతూ జూన్ 1 నుండి 15 తేదీ వరకు ప్రతీ డీలర్ షాప్ వద్ద అందుబాటులో ఉండి, సరుకులు పంపిణీ చేయాలని, గ్రామాలలో రైస్ కార్డుదారులకీ ముందుగా సమాచారం ఇవ్వాలని తెలిపినారు. అదేవిధంగా వికలాంగులు, 65 సంలు పైబడి మంచంపట్టినవారికి డీలర్ ద్వారా సరుకులు డోర్ డెలివరీ చేయబడునని, తెలిపినారు. ఈ సమావేశంలో సివిల్ సప్లైస్ డి టి రవి, మండలంలోని అన్ని రేషన్ షాప్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు