పయనించే సూర్యుడు జనవరి 18 ఆదిలాబాద్ జిల్లా మండలం ఉట్నూర్ రిపోర్టర్ షైక్ సోహెల్ రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి రైతు ఉత్పత్తి సంఘాలు దోహదపడతాయని ఐటీడీఏ పీవో కుష్బూ గుప్త అన్నారు. శనివారం ఉట్నూరు ప్రాజెక్టు అధికారి కార్యాలయంలో ట్రైకార్ మొదటి దశ చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ట్రైకార్ ద్వారా ఆసిఫాబాద్ జిల్లా జైనాధ్, రెబ్బెన రైతు ఉత్పత్తి సంఘాలకు మొదటి దశ రాయితీగా వచ్చాయన్నారు. ఒక్కో రైతు ఉత్పత్తి సంఘానికి రూ.7.50 లక్షల చొప్పున అందించారు.