
పయనించే సూర్యుడు 18.0 6. 20 26 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టి కేగంగాధర్ : రేవంత్ రెడ్డి ది తుగ్లక్ పాలన రైతులను రోడ్డుపైకి లాగిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వం దే రైతు ఏడ్చిన రాజ్యం ఎన్నటికీ బాగుపడదు తెలంగాణ రైతాంగ సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భీమా పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. రైతు కుటుంబంలో ఎవరైనా దురదృష్టవశాత్తు మరణిస్తే, వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా కేవలం వారం రోజుల వ్యవధిలోనే రూ.5 లక్షల భీమా మొత్తాన్ని నేరుగా అందించే గొప్ప పథకాన్ని కేసీఆర్ అమలు చేశారు.గుంట భూమి ఉన్న చిన్న రైతు నుండి పెద్ద రైతు వరకు ఎలాంటి వివక్ష లేకుండా ప్రతి రైతు కుటుంబానికి భరోసాగా రైతు భీమా నిలిచింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. రైతు భీమా కోసం ఎల్ఐసీకి చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాలను సకాలంలో చెల్లించకపోవడంతో గత కొన్ని నెలలుగా రైతు భీమా అమలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది.రైతు కుటుంబాల కన్నీళ్లు తుడవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరం.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటీవల కోట్లాది రూపాయలు టివిలల్లో అడ్వర్టైజ్మెంట్ ప్రకటనల కోసం ఖర్చు చేస్తోంది. ఆ ప్రకటనల కోసం వెచ్చిస్తున్న డబ్బు రైతు భీమా ప్రీమియం చెల్లింపులకు వినియోగిస్తే రైతు కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందని వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.రైతు భీమా పథకానికి వెంటనే బకాయిలు చెల్లించి, మరణించిన రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల భీమా సాయం అందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు 24 గంటల ఉచిత, నాణ్యమైన విద్యుత్‌ను అందించగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సమయాన్ని 11 గంటలకు తగ్గించిందని విమర్శించారు. ఆ 11 గంటల్లో కూడా నిరంతరాయంగా ఇవ్వకుండా, మూడు గంటలు ఒకచోట, మరో మూడు గంటలు ఇంకొక చోట ఇస్తూ ట్రిప్పుల పేరిట రైతులను అరిగోస పెడుతున్నారని మండిపడ్డారు. కలెక్టర్ హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదు
బాల్కొండ నియోజకవర్గ రైతాంగం ఎదుర్కొంటున్న ఈ పంపిణీ సమస్యలపై జిల్లా కలెక్టర్ స్వయంగా స్పందించాలని వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. కలెక్టర్ ఇక్కడికి వచ్చి ప్రభుత్వంతో మాట్లాడి, సమస్యను పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు రైతుల తరఫున ఈ ఆందోళన కార్యక్రమాన్ని విరమించేది లేదని ఆయన తేల్చి చెప్పారు.డిమాండ్లు పరిష్కరించకపోతే గ్రామానికి చెందిన రైతులు ఆ గ్రామానికి కథా నాయకులై తమ నిరసనలు తెలియజేయాలనీ పిలుపునిచ్చారు.రైతుల హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని, సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు.కలెక్టర్ తరపున జిల్లా అడిషనల్ కలెక్టర్ మరియు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ధర్నా జరుగుతున్న స్థలానికి చేరుకొని కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడించగా . వారికీ రైతాంగం తరపున ఎమ్మెల్యే పలు డిమాండ్లను ఉంచారు ప్రభుత్వానికి పలు డిమాండ్లు చేసారు ఎరువుల కొనుగోలు కోసం ప్రస్తుతం అమలు చేస్తున్న యాప్ విధానం వల్ల రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ తలనొప్పి విధానాన్ని ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.రైతులకు ఎకరానికి కనీసం 4 సంచుల చొప్పున యూరియాను అందించాలని, అది కూడా విడతల వారీగా కాకుండా ఒకే విడతలో (ఒకేసారి) సరఫరా చేయాలని స్పష్టం చేశారు.గతంలో లాగే అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (సొసైటీలు) మరియు ప్రైవేట్ ఫర్టిలైజర్ దుకాణాలలో యూరియా నిల్వలను విరివిగా, సరిపడా స్టాక్ అందుబాటులో ఉంచాలని కోరారు.రాష్ట్రానికి రావాల్సిన యూరియా కోటాను మరింత పెంచేలా స్థానిక బీజేపీ ఎంపీ చొరవ చూపాలని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తో మాట్లాడి అదనపు సరఫరా చేయించేలా ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వం పెంచిన 20-20-0, జింక్ మరియు ఇతర కాంప్లెక్స్ ఎరువుల ధరలను తక్షణమే తగ్గించి రైతులకు ఉపశమనం కలిగించాలని డిమాండ్ చేశారు.కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయానికి అందించిన విధంగా నిరంతరాయంగా 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాము అని కలెక్టర్ చెప్పడంతో ధర్నా విరమించారు.