రైతులకు సరిపడింత యూరియని అందించండి
ఎమ్మెల్సీ నగర్ కుంట నవీన్ రెడ్డి
కేశంపేట్,కొత్తపేట పిఎసిఎస్ కార్యాలయలలో యూరియా కొరకు బారులు తీరిన రైతులు
పోలీసులను కాపలా పెట్టి యూరియా సరఫరా చేయడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం
రెండు రోజుల్లో రైతులందరికీ సరిపడినంత యూరియా అందించాలి
రైతులందరికీ అన్ని చోట్ల యూరియాని అందుబాటులో ఉంచేలా అధికారులు దృష్టి పెట్టాలి
సొంత జిల్లాలోనే రైతులకు యూరియాని సరిపడా అందించలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెబుతారు
ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి
( పయనించే సూర్యుడు జూలై 26 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
సొంత జిల్లాలోనే రైతులకు యూరియాని సరిపడా అందించలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏంసమాధానం చెబుతారని యూరియా కొరత పట్ల ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యంపై మండిపడ్డారు.పంట దిగుబడి పెరగాలంటే యూరియా ప్రాముఖ్యత ఎంత ముఖ్యమైందో తెలిసికూడా రైతులకు సరిపడా యూరియాని అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రైతులకు యూరియా సరఫరా చేయాలంటే పోలీసులను కాపలా పెట్టుకొని మరీ సరఫరా చేయడం ప్రభుత్వ వైఫల్యానికి ఇది నిదర్శనమని ఇదే నా రైతులపైన చూపించే ప్రేమా? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పండగ సంబరాలను గొప్పగా ప్రచారం చేసుకొని సంబరాలు జరుపుకోవడంలో చూపిన శ్రద్ధ సమయానికి రైతులకు యూరియా అని సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమైందని దీనికి నిదర్శనమే షాద్ నగర్ లోని కేశంపేట మండలంలోని కేశంపేట మరియు కొత్తపేట పిఎసిఎస్ కార్యాలయాల వద్ద రైతులందరూ పెద్ద సంఖ్యలో బారులుతీరిన సందర్భాన్ని చూస్తే జిల్లాలో యూరియా కొరత ఎంత మొత్తంలో ఉందో అనేది స్పష్టంగా కనబడుతుందని కొరత ఉన్నందుకే పోలీసులను కాపలా పెట్టి యూరియాని అందిస్తున్నారని ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి అన్నారు. అంతేకాకుండా గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నడూ రైతులకు యరియా కొరకుగాని విత్తనాల కొరకుగాని ఎప్పుడూ బారులు తీరలేరని గుర్తు చేస్తూ,రెండు రోజుల్లో రైతులకు సరిపడినంత యూరియాని అందుబాటులోకి తీసుకువచ్చే దానిపైన జిల్లా మంత్రులు,అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు.