
పయనించే సూర్యుడు జూలై 15 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు) తిరుపతి జిల్లా సూళ్లూరు పేట మున్సిపాలిటీ పరిధిలో గత కొన్ని రోజులుగా సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ రోడ్డు లోని విద్యుత్ వినియోగదారులకు ప్రతిరోజు విద్యుత్తు నిలిపివేస్తూ ఈ ప్రాంత వాసులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఇందుకు బాధ్యత ఎవరు వహిస్తారు ? ఈ విషయమై అధికారులకు ఫోన్ చేసి అడిగితే ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెబుతున్నారు ఆ సమాధానం చెప్పేముందు విసిగించుకుంటూ నీ ఒక్కరికి సేవ చేసేందుకు ఈ డిపార్ట్మెంట్ లేదు అన్న ధోరణిలో మీకోసం కొత్త ట్రాన్స్ఫార్మర్ వెంటనే రెడీ చేయలేమని ఒక వర్గం ఇలా ఎవరికి వచ్చిన సమాధానం వారు చెబుతూ ఆర్గ్యుమెంట్ అనవసరం అని చెప్పడం విడ్డూరంగా ఉంది పోనీ ఇదేమన్నా ఒకరోజు రెండు రోజులు అనే విషయం అయితే అలానే అనుకోవచ్చు సంవత్సరాల తరబడి ఈ విషయం ఇలానే కొనసాగుతున్నది కానీ దీని మీద ఏ అధికారి స్పందించడం లేదు ఉన్న వాళ్లకు మాత్రం 24 గంటలు కరెంటు డిస్టబెన్స్ లేకుండా పోతున్నది కానీ రైల్వే స్టేషన్ రోడ్డులోని పోస్ట్ ఆఫీస్ నుండి రైల్వే కోటర్స్ పరిధి వరకు మాత్రం అత్యధిక వినియోగదారులు ఉన్నట్టుగా చిత్రీకరిస్తూ అధికంగా విద్యుత్తును వాడుతున్నారు అనే అభియోగం చేస్తూ దానికి తగ్గ ఏర్పాట్లు మాత్రం మేము చేయలేము అని చేతులెత్తేస్తున్న అధికారులు వినియోగదారులకు చెప్పే సమాధానం మాత్రం అప్పు తీసుకొని కట్టలేని వాడి పరిస్థితి ఇలా మారిపోయిందనే చెప్పాలి... ఎప్పుడో 1950 సంవత్సరంలో వేసిన తీగలను ఇంకా ఉపయోగించుకుంటూ వాటిని ఏమాత్రం మార్చకుండా రోజుకు ఒక తీగ తెగిపోతున్న దానికి అతుకులేస్తూ కారణాలను మాత్రం విద్యుత్ శాఖ చెప్పకుండా వినియోగదారులపై విసిగించుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది ఇంతకీ ఈ రోడ్డు వలన ప్రభుత్వానికి ఆదాయం ఉందా లేదా ఒక విధంగా చూస్తే మున్సిపాలిటీ అధికారులు కూడా ఈ రోడ్డుమీద మురుగునీటి కాలువ వేస్తామని గత ఐదు సంవత్సరాలుగా చెబుతూనే ఉన్నారు. చేస్తారన్న నమ్మకం కూడా చచ్చిపోయింది అది కూడా అలాగనే ఉంది ఇక చెత్త తీసుకెళ్లే వారైతే నేరుగా వచ్చి శివాలయంలో చెత్తను మాత్రమే తీసుకెళ్తున్నారు ఈ వీధిలో వారికి స్వేచ్ఛగా ప్రభుత్వం ఏ విధమైన ప్రాథమిక సదుపాయాలు చేయలేదని మున్సిపాలిటీ మరియు విద్యుత్ సిబ్బందిలో కొంతమంది ఈ విధంగా ఈ వీధి పై కక్షగట్టి చేస్తున్నట్లుగానే ఉంది అని ఈ ప్రాంత ప్రజలు చెబుతున్నారు నిజమా కాదా? అధికారులే సమాధానం చెప్పాలి...?