
పయనించే సూర్యుడు ఆగస్టు 13 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు )తిరుపతి జిల్లాసూళ్లూరుపేట పట్టణం
నడిబొడ్డున ఉండే రైల్వే స్టేషన్ రోడ్డు లో గత కొన్ని సంవత్సరాలుగా విద్యుత్ అంతరాయం అనధికారికంగా జరుగుతూనే ఉంది దీనికి కారణం ఈ వీధిలో అధికంగా లోడ్ వాడుతున్నారు అని విద్యుత్ శాఖ ఆరోపణ అదే నిజమైతే ఈ వీధిలో ఇళ్ల సంఖ్య పెరిగే అవకాశం అయినా ఉండాలి లేదా పెద్ద పెద్ద అంతస్తులతో బిల్డింగులైన ఉండాలి ఈ రెండు లేకుండానే అధికారులు తమ ఆరోపణలను ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారే కానీ పరిష్కారం చేయడానికి సరైన నిర్ణయం తీసుకో లేకపోతున్నారు అని అనుకోవలసి వస్తున్నది వేలకు వేలు కరెంట్ బిల్లులు మాత్రం వస్తున్నాయి బిల్లులు వచ్చిన వెంటనే డబ్బులు చెల్లించాలని మెసేజ్ లు వస్తున్నాయి కానీ పవర్ ఫాల్ట్ జరిగినప్పుడు మాత్రం ఒకరి మీద ఒకరు విషయాన్ని తోసేస్తూ చివరకు అది అధిక లోడు ప్రాబ్లం వల్లనే జరుగుతుంది అనే ఆరోపణలు కూడా చేస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు అందిస్తామని చెబుతున్న విద్యుత్ శాఖ సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ రోడ్డు పరిధిలో మాత్రం అది కచ్చితంగా చేయలే కపోతున్నది అంటే ఇక్కడ ఎవరూ అడిగేంత పెద్ద మనుషులు లేరనే ఉద్దేశమా? లేక అడిగితే ఏదో ఒక సమాధానం చెప్పుకుందామన్న ఆలోచనా నిజంగా అధికారులకు బాధ్యతగా వినియోగదారులకు సేవ చేయాలన్న ఉద్దేశం ఉంటే గత నెల రోజులుగా తీవ్రమైన విద్యుత్ సంక్షోభం ఈ వీధిలో నెలకొంటున్నా కారణాలు మాత్రం ప్రజలను ఉద్దేశించే ఆరోపణలు చేస్తున్నారు చేయవలసిన కార్యక్ర మాలను చేయడం లేదని ఈ పరిధిలో నివాసం ఉంటున్న వారు ఆరోపిస్తున్నారు కాదని అధికార పూర్వకంగా లిఖితపూర్వకంగా అధికారులు ఖండించ గలిగితే కారణాలు చెప్పగలిగితే సంతోషమే ఎంతైనా నేడు ఆగస్టు 12వ తారీకు బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి ఇక్కడ విద్యుత్ అంతరాయం ఏర్పడి అనాధికార విద్యుత్ కోతగా దీనిని అనుకోవ లసి వస్తుంది ..అధికారు లు చెప్పే సమాధానం పొంతన లేనిదిగా ఉంది అని ఈ ప్రాంత వాసులు ఆరోపిస్తున్నారు..!?