పయనించే సూర్యుడు జులై 12 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు
గుడిసెల్లో ఉంటున్న నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు
రఘునాథపాలెం మండలం కె.వి. బంజర లో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల, పాల్గొన్న జిల్లా కలెక్టర్
రఘునాధపాలెం గ్రామంలో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. మంత్రివర్యులు, శనివారం రఘునాథపాలెం మండలం కె.వి. బంజరలో కెవి బంజర నుండి క్రొత్త తండా క్రాస్ రోడ్డు వరకు ఎస్.టి.ఎస్.డి.ఎఫ్. నిధులు ఒక కోటి 30 లక్షల అంచనాతో నిర్మించనున్న బి.టి. రోడ్డు నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ గ్రామంలో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులు నాణ్యతతో పూర్తి చేయాలని, మనం చేసే పని పది కాలాలపాటు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని అన్నారు. రోడ్డు నిర్మాణ పనులను గ్రామ ప్రజలు పర్యవేక్షించాలని అన్నారు.
నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశ పెట్టిందని అన్నారు. గ్రామంలో గుడిసెల్లో ఉంటున్న నిరుపేదలను ఎంపిక చేసి వారికి 5 లక్షల రూపాయల సహాయం అందించి సొంత ఇళ్ళు నిర్మాణం చేసే విధంగా అర్హులందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంత రావు, సంబంధిత శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.