పయనించే సూర్యుడు జనవరి 18 : జగ్గయ్యపేట ప్రతినిధి భూక్యా కవిత :... జగ్గయ్యపేట పట్టణం ఆర్టిసి బస్ స్టేషన్ లో జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా గ్రామీణ ప్రయాణీకులకు రోడ్డు భద్రత పట్ల మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ యంవియన్ రాజు అవగాహన కల్పించారు.హెల్మెట్ లేకుండా అటుగా బైక్ పై వెళ్ళుతున్న వాహనదారుని ఆపి హెల్మెట్ ని అందించి,సురక్షిత ప్రయాణం, ఆనందకరమైన జీవితం కోసం తప్పక తలకు హెల్మెట్ ధరించాలని ఆయన అన్నారు.కారు నడిపే వారు తప్పని సరిగా సీటు బెల్టు పెట్టుకోవాలని,మద్యం త్రాగి వాహనం నడపకూడదని,చిన్న పిల్లలకు వాహనాలను నడపటానికి ఇవ్వదని,ఆటో లో ఒవర్ లోడ్ ప్రయాణం మంచిది కాదని ఆయన అన్నారు.సురక్షిత ప్రయాణం కోసం ప్రతి ఒక్క వాహనదారులు వాహనాల పేపర్స్,ఇన్సురెన్స్ మరియు పొల్యూషన్ చెల్లుబాటులో ఉంచుకోవాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో యంవిఐ కార్యాలయం సిబ్బంది,ప్రజలు, ప్రయాణీలు తదితరులు పాల్గొన్నారు.