పయనించే సూర్యుడు జనవరి 10 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి)
చేజర్ల మండలంలోని చేజర్ల లంబిని విద్యాలయంలో ముందస్తు సంక్రాంతి పండుగ సంబరాలు నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యాలయం ఆవరణమంతా తోరణాలు చెరుకు గడలతో,రంగవల్లికలతో,పల్లెటూరి వాతావరణం తీసుకొచ్చారు. కాలుష్యం లేని భోగిమంటలతో వేడుకలకు నాంది పలికారు.విద్యార్ధులు సాంప్రదాయ దుస్తుల్లో హాజరయ్యారు.ఈ సందర్భంగా కరస్పాండెంట్ రామయ్య మాట్లాడుతూ మనసాంప్రదాయాలు,ఆచార వ్యవహారాలు మనపండుగల్లోనేదాగున్నాయన్నారు.కావున విద్యార్ధులు పండుగలోని మూలాలను తప్పకతెలుసుకోవాలన్నారు.సంక్రాంతి పండుగంటేనే భోగి మంటలు,పిండి వంటలు,పూరిగుడిసెలు, గొబ్బెమ్మలు,హరిదాసులు,గాలి పటాలు, విద్యార్థిని విద్యార్థుల నృత్య ప్రదర్శనలు,రంగా రంగవల్లికలలో పాల్గొన్న బాలికలకు బహుమతులు అందజేశారు.ఇలా సంక్రాంతి పండుగప్రఖ్యాతి గాంచిన సంక్రాంతి పండుగను ప్రతి ఇళ్లల్లో సంతోషంగాజరుపుకోవాలనిఅన్నారు.ఈకార్యక్రమంలో లంబిని విద్యాలయం అధ్యాపకులు . విద్యార్థి విద్యార్థినులు పాల్గొని