పయనించే సూర్యుడు బాపట్ల ఫిబ్రవరి 21: రిపోర్టర్ (కే శివకృష్ణ) బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు ముప్పలనేని శ్రీనివాసరావు యువ పారిశ్రామికవేత్త ముప్పలనేని శేషు సుమంత్ గురువారం నాడు రాజధాని అమరావతి లో ఆంధ్రప్రదేశ్ ఐటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా వ్యక్తిగతంగా కలిసి ఆంధ్రప్రదేశ్ లో లక్షలాది ఉద్యోగాల కల్పన మరియు విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలె ధ్యేయంగా వారు చేస్తున్న కృషిని అభినందించినట్లు ముప్పలనేని ఒక పత్రికా ప్రకటనలొ తెలియజేశారు నారా లోకేష్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ పెద్దలు కీర్తిశేషులు ముప్పలనేని శేషగిరిరావు ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలో బాపట్ల ఒకటిగా చేసిన కృషిని గుర్తు చేస్తూ ఇంజనీరింగ్ కాలేజీ విద్యకు ఆధునికతను జోడిస్తూ కాలేజీ ని అభివృద్ధి చేయవలసిందిగా దానికి ప్రభుత్వపరంగా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చినట్లు తెలియజేశారు