పయనించే సూర్యుడు జనవరి 23 మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- మూసాపేట్ లోని శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం నూతన ఆలయ కమిటీ పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిధులుగా హాజరైన మేడ్చల్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జి సునీత మహేందర్ రెడ్డి నియోజకవర్గ ఇంచార్జి బండి రమేష్ టీపీసీసీ అధికార ప్రతినిధి డా.సత్యం శ్రీరంగం ఆలయ కమిటీ చైర్మన్ తూము శ్రీహరి పటేల్ కమిటీ సభ్యుల చేత ప్రమాణ స్వీకరణ చేయించి, శుభాకాంక్షలు తెలియజేసినారు. ఈ కార్యక్రమం లో మూసాపేట్ మాజీ సర్పంచ్ తూము శ్రీనివాస్ రావు, బ్లాక్ అధ్యక్షులు, బ్లాక్ మహిళా అధ్యక్షురాళ్లు, డివిజన్ అధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు భక్తులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.